Balagam Fame Muralidhar Gowd : ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యాక నటన మీద ఆసక్తితో సీరియల్స్ వైపు వెళ్లి అలా సినిమాల్లోను అవకాశాల కోసం తిరుగుతూ చిన్న చిన్న సినిమాల్లో చిన్నాన్న పాత్రలను కూడా చేసిన మురళీధర్ గారు డిజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కథనాయకుడు, మహానాయకుడు, వినవయ్య రామయ్య, పిట్ట కథలు వంటి సినిమాల్లో నటించినా మరింత మంచి పేరు నటనకు తెచ్చింది మాత్రం బలగం సినిమానే. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు రెండు రాష్ట్రాలోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకీ ఈ సినిమా మంచి పేరు అలాగే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు సినిమా గురించి అందులో అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను అలాగే తన కెరీర్ లో తాను పడిన ఇబ్బందులను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

కల్లు దుకాణంలో పనిచేశా….
నారాయణ పాత్రలో అందరికి చేరువైన మురళీధర్ గారిది మెదక్ జిల్లా లోని పల్లె. ఆయన తండ్రికి కల్లు దుకాణం ఉండేదట. అదే వారి జీవన ఆధారం కావడం వల్ల మురళీధర్ గౌడ్ గారు కూడా కల్లు దుకాణంలో పనిచేసేవారట. అలా తరువాత బ్రాంది షాపు పెట్టడం వల్ల అక్కడ కూడా మొదట్లో పనిచేసి కుటుంబాన్ని పోషించేవారట. ఆ తరువాత ఆయన చదువుకు తగ్గ ఉద్యోగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో రావడంతో మొదట్లో వనపర్తి లో చాలా ఏళ్ళు పనిచేసిన ఆయన ఆ పైన హైదరాబాద్ లో పనిచేశారట.

ఇక ఆయన కు భార్య ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరు బాగా సెటిల్ అయ్యారంటు తెలిపారు మురళీధర్. ఇక తనది ప్రేమ వివాహమా లేక పెద్ధలు కుదుర్చిన పెళ్ళా అనే ప్రశ్నకు నేనేతే పెద్దలు చూసిన అమ్మాయిని చేసుకున్న కాకపోతే నా భార్య ముందే నన్ను చూసి ఇష్టపడ్డానని చెబుతుంటుంది అంటూ చెప్పారు.
































