Balagam @ Oscar : చావు గురించి చావు చుట్టూ కుటుంబ విలువలను చెబుతూ అందరి చేత కన్నీరు పెట్టించిన సినిమా ‘బలగం’. ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ముల మధ్య అనుబంధాలు కనుమరుగవుతున్న వేళ మళ్ళీ పల్లె వాతావరణం కుటుంబ విలువలు చూపి అందరినీ ఆకట్టుకుంటున్న బలగం సినిమా ఇప్పటికే చిన్న సినిమాగా విడుదల అయి పెద్ధ విజయం నమోదు చెసింది. పల్లెల్లో ముఖ్యంగా అందరూ కలిసి కూర్చొని సినిమాను చూస్తూ కంటతడి పెడుతున్నారు. అయితే ఈ సినిమా సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేయడం విశేషం.

అంతర్జాతీయ అవార్డులను అందుకుంటున్నా…
ఇప్పటికే బలగం సినిమా థియేటర్లను దాట్టుకుని పల్లెల్లో సామూహికంగా చూసే రేంజ్ కి వెళ్ళిపోగా మరోవైపు ఖండంతరాలు దాటుకుని అవార్డులను కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డులు బలగం సినిమాకు రాగా వాషింగ్టన్ డిసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా రెండు అవార్డులను సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవనున్నట్లు ఆ సినిమా నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ సినిమాను ఆస్కార్ కి పంపడం కోసం బడ్జెట్ కేటాయించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకుని సత్తా చాటగా ఇక ఇప్పుడు బలగం కూడా ఆస్కార్ గెలుచుకోవాలని కోరుకుందాం.
































