Balaji nagalingam : జంధ్యాల గారి తరువాత హాస్య ప్రధాన చిత్రాలను తీస్తూ సక్సెస్ సాధించిన డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ. ఆయన తేసిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలాంటి ఈవివి గారి వల్ల తాను చాలా నష్టపోయానంటూ డిస్ట్రిబ్యూషన్ తో మొదలై ప్రొడ్యూసర్ గా మారిన బాలాజీ నాగలింగం తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. చిలక్కోట్టుడు సినిమా వల్ల తాను ఎంతలా మారిపోయాడో తెలిపారు.

నన్ను కాలితో తన్నినంత పని చేసారు….
ఈవివి సత్యనారాయణ గారితో సీతా రత్నం గారి అబ్బాయి సినిమా సమయం నుండి పరిచయం ఉందని, ఆయన తో కలిసి ఆ సినిమా సమయం నుండే ట్రావెల్ అవుతున్నట్లు తెలిపారు. ఇక నాగార్జున హలో బ్రదర్ సినిమా వంటి విజయల వల్ల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూషన్ అటు రీమేక్ ప్రొడ్యూసర్ గా ఉన్న బాలాజీ నాగలింగం చిలక్కోట్టుడు సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. అప్పటికే సినిమా తీయడానికి అడ్వాన్స్ ఇచ్చి చాలా కాలం అవ్వడంతో ఈవివి గారిని అడగడంతో వెంటనే సినిమా ముహూర్తం ప్రారంభించారు. ముహుర్తానికి చిరంజీవిని కూడా పిలిచారు. ఇక టైటిల్ చిలక్కోట్టుడు అని చెప్పగా నేను వద్దని చెప్పాను అయిన వినకుండా ముహూర్తం షాట్ చివరి నిమిషంలో పేరు అదే అని రాసారు.

నాకు ఆయన కాలితో తన్నినట్లు అనిపించింది. ఇక హీరోగా నాగార్జున అనుకన్నాం కానీ జగపతి బాబు అని అప్పుడు చెప్పారు. నాగార్జున గారి డేట్స్ చూసే వ్యక్తి స్టూడియోకి కి వచ్చి కలవమని చెబితే ఈవివి కి ఇగో అడ్డొచ్చి వెళ్ళలేదు. ఇక జగపతి బాబు లాంటి హీరోకి అలాంటి మాస్ టైటిల్ బాగోదని చెబితే నోరుమూసుకో నీకేం తెలుసు అన్నాడు. బడ్జెట్ ఎక్కువవుతోంది జగపతి బాబు కి అంత బడ్జెట్ వద్దని చెబితే వినలేదు నీ వల్ల కాకపోతే నేనే చేసుకుంటా అంటూ అన్నాడు కానీ నన్ను పీల్చేశాడు ఆ సినిమాతో, చివరికి సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయాను. దాని నుండి కోలుకోడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది అంటూ చెప్పారు.



























