Balakrishna : నందమూరి నట వారసుడిగా ఎన్టీఆర్ కొడుకుగా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన బాలకృష్ణ ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో వచ్చి అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నాడు. తొంభైయ్యో దశకములో టాలీవుడ్ లో టాప్ హీరోల్లో బాలకృష్ణ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు మాస్ టచ్ తో ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. అయితే ఎప్పుడూ సినిమాలు అభిమానులు అంటూ తండ్రి అంటే అమితమైన గౌరవం, భయభక్తులు ఉన్న బాలకృష్ణ ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలాడట.

హీరోయిన్ తో సిన్సియర్ గా ప్రేమ…
అప్పట్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో బాలయ్య ఒక హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడట. చెన్నై కి చెందిన ఆ హీరోయిన్ ను చాలా ప్రేమించానని తన సన్నిహితులకు కూడా చెప్పేవాడట బాలకృష్ణ. అయితే అప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగ ఉన్న ఎన్టీఆర్ గారు అన్న హరికృష్ణ గారికి విషయం తెలిసి కాకినాడలో బంధువుల అమ్మాయి అయిన వసుంధర ని ఇచ్చి బాలకృష్ణ కు వివాహం చేశారట.

అయితే బాలయ్య ఆ హీరోయిన్ ను ప్రేమించడం మాత్రం నిజమేనని నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఒకసారి ఇంటర్వ్యూ లో చెప్పడం గమనార్హం. కానీ తండ్రి మాటకు విలువ ఇచ్చి ప్రేమను వదులుకున్నాడు బాలయ్యబాబు. బాలయ్య బాబు ప్రస్తుతం ఎన్ బి కే 107 లో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఇటీవల అఖండ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్న బాలయ్య అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.



























