Balakrishna : బాలయ్య బాబు అనగానే మాస్ కా బాప్ అనేలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఒకవైపు నందమూరి లెగసీ కాపాడుతూ మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ఇటు హిందూపురం ఎమ్మెల్యే గా రాజకీయాలలో కంటిన్యూ అవుతూ మరో వైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తు ఇంత ఇమేజ్ ఉన్న బాలయ్య చాలా సింపుల్ గా ఉంటారు. సెట్ లో ఉన్నపుడు అందరితో కలిసే ఉంటారు ప్రత్యేకంగా హీరో అని క్యారవాన్ లో కూర్చొని ఉండే రకం కాదు. ఇక ప్రేమించినా, కోప్పడ్డా బాలయ్య బాలయ్యే. అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి భోజనం చేసినా, కోపం వస్తే అక్కడే చంప పగలగొట్టడం ఏం చేసినా బాలయ్య రూట్ సపరేటు అన్నట్లు ఉంటది.

సప్తగిరి కాళ్ళు పట్టుకోబోయిన బాలయ్య…
బాలయ్య నటిస్తున్న ఎన్బికే 107 షూటింగ్ లో భాగంగా జరిగిన ఒక సంఘటన ఇపుడు నెట్టింట్లో బాగా వైరల్ అయింది. బాలకృష్ణ, సప్తగిరి ఇద్దరూ ఒక డైలాగను ఒకేసారి ఇద్దరూ చెప్తూ ఉండగా మధ్యలో బాలయ్య తడబడి ఆపేస్తారు అయితే సప్తగిరి మాత్రం పూర్తిగా డైలాగను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక బాలయ్య సప్తగిరి డైలాగు బాగా చెప్పేసరికి నీ కాళ్ళు కొంచెం పైకి ఎత్తు దండం పెడతాను…
Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022
అనగా సప్తగిరి అయ్యో ఏంటండీ అంటూ కింద కూర్చొని ఉండిపోతే బాలయ్య నేను ఒంగితే మళ్ళీ నడుం పట్టుకుంటుంది నువ్వే కాళ్ళు పైకి పెట్టు దండం పెడ్తా అంటూ అందరూ నవ్వుకున్నారు. కానీ బాలయ్య చేసిన పనికి మాత్రం నెటిజన్స్ వావ్ బాలయ్య సింప్లిసిటీ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య భోళా మనిషి అంటూ, నిగర్వి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
































