Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి పోటీగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 డేస్ పూర్తి చేసుకుని రికార్డు సాధించింది.

ఈ సినిమా 8 సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఓటిటిల హవా నడుస్తున్న సమయంలో ఒక సినిమా ఇలా 8 సెంటర్లలో 100 రోజులు ఆడటం గొప్ప విషయం . హిందూపురం, చిలకలూరిపేట, ఆలూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈనెల 23వ తేదీ 100 డేస్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ ఈవెంట్ గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని ఆ పోస్టర్ లో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో పాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

Balakrishna: చిరంజీవి రవితేజ నటించడమే కారణమా…
రెండు సినిమాలు మంచి హిట్ అందుకోగా.. వీరసింహారెడ్డి సినిమా మాత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ లో సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని ఉండటం చిరంజీవి పై సెటైర్ వేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించాడు. వీరసింహారెడ్డి లో మాత్రం బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. దీంతో బాలయ్యా సింగిల్ గా రికార్డ్ సాధించాడని ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.































