Balakrishna: బాబీ సినిమాలో కూడా రిపీట్ కాబోతున్న బాలయ్య సెంటిమెంట్… ఈసారి కూడా హిట్టే!

0
40

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది ఈ సినిమా అనంతరం బాలకృష్ణ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా బాలయ్య పై కొన్ని యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.మరి కొద్ది రోజులలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ సారధి స్టూడియోలో జరగబోతుంది.

ఇకపోతే ఈ సినిమా గురించి మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సాధారణంగా బాలకృష్ణ సినిమాలలో కొన్ని సెంటిమెంట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈయన టైటిల్ లో కనుక సింహ అనే పదం వస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఉండడంతో ఈమధ్య కాలంలో బాలయ్య సినిమాలకు వచ్చే టైటిల్స్ అన్నింటిలోనూ సింహ అనే పదం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Balakrishna: ద్విపత్రాభినయంలో బాలయ్య..


ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోయే సినిమా విషయంలో కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తెలుస్తుంది. అయితే టైటిల్ విషయంలో కాకుండా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించే సినిమాలు కూడా హిట్ అవుతాయన్న నమ్మకం అందరిలోనూ ఉండేది దీంతో ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని ఇందులో తండ్రి కొడుకుల పాత్రలో బాలయ్య నటించబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఈ సినిమా కూడా హిట్ అని అభిమానులు భావిస్తున్నారు.