Movie News

“నేను ఇప్పటివరకు ఏ హీరోని అలా చూడలేదు”.. బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగ్యా జైస్వాల్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో బాలయ్యకు జోడిగా నటిస్తున్న ఈమె.. తాజాగా బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది..మొదటగా ‘అఖండ’ సెట్ లో బాలయ్య బాబును చూసి ఆశ్చర్యపోయిందట ప్రగ్యా జైస్వాల్. జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న సమయంలో బోయపాటి నుండి ప్రగ్యాకి కాల్ వచ్చిందట.నేను బాలయ్య బాబుతో చేస్తోన్న సినిమాలో మీరే హీరోయిన్ అని బోయపాటి చెప్పగానే ప్రగ్యా తెగ భయపడిపోయిందట.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ…’నేను భయపడటానికి కారణం అప్పటికే బాలయ్యగారికి బాగా కోపం అని విన్నాను. పైగా నేను అఖండ సినిమా చేస్తున్నాను అని తెలియగానే.. బాలయ్యగారు సెట్‌ లో ఉన్నప్పుడు, నువ్వు చాలా సైలెంట్‌ గా ఉండు అంటూ కొందరు నాకు సలహా ఇచ్చారు.అందుకే నేను ఫస్ట్ డే షూట్ లో చాలా సైలెంట్ గా ఉన్నాను. కానీ, బాలయ్యగారు నవ్వుతూ పలకరించడం, తోటి నటీనటులకు ఎంతో గౌరవం ఇవ్వడం చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అప్పటివరకు జూనియర్ ఆర్టిస్ట్ ల పట్ల ఏ హీరో అంత మర్యాదగా ప్రవర్తించడం నేను చూడలేదు. పైగా సెట్‌లో బాలయ్య బాబుగారు చాలా సరదాగా ఉండటాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. బయట ఆయన పై ఉన్న టాక్ కి, ఆయన ప్రవర్తనకు చాల తేడా ఉంది.నిజంగా ఆయన అంత కూల్‌గా ఉండటం వల్లే నేను చాలా ధైర్యంగా నటించానని చెప్పుకొచ్చింది ప్రగ్యా.

ఇక ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబుతో రొమాన్స్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది ప్రగ్యా. కెరీర్ స్లోగా ఉంది కాబట్టి, ఆమెకు ఇప్పుడు బాలయ్య బాబు సినిమానే అత్యంత కీలకం. అందుకే ఈ సినిమా కోసం బాలయ్య కంటే కూడా ‘ప్రగ్యా జైస్వాల్’నే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తోందట. అలాగే గ్లామర్ విషయంలో ముఖ్యంగా ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా ప్రగ్యా ముందుకు వెళ్తుందట…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

1 hour ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

2 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

2 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

4 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

4 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

4 hours ago