Chiranjeevi – Balakrishna : మెగాస్టార్ చిరంజీవి – యువరత్న బాలకృష్ణ సినీ పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్రనటులు. చిరంజీవి డాన్స్ ఫైట్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తే.. బాలయ్య యాక్షన్, డైలాగులతో ఇరగదీస్తారు. 1980 దశకం నుంచి నేటి వరకు వారి చిత్రాల పరంపరలో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ చిత్రాలలో నటించి తమను తాము నిరూపించుకున్న కథానాయకులు. 1980 మొదటి దశకంలో చిరంజీవి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ ఆయనకు “ఖైదీ” చిత్రం ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అదే కోవలో బాలయ్య బాబు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ “మంగమ్మగారి మనవడు” చిత్రం ఆయన కెరీర్ కి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.

అప్పటికి అగ్ర దర్శకులైన దాసరి, రాఘవేంద్రరావు, కోదండరాంరెడ్డి, కోడి రామకృష్ణ, బి గోపాల్ లాంటి దర్శకుల చిత్రాలలో కథానాయకులుగా నటించి అనేక బ్లాక్బస్టర్స్ ని తమ అభిమానులకు అందించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీస్ ఖైదీ, అడవి దొంగ, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్ లాంటి చిత్రాలలో నటించినప్పటికీ యువరత్న బాలకృష్ణ మాత్రం ఇందులో ఒక చిత్రమంటే ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు.

1990 వైజయంతి మూవీస్, అశ్వినీ దత్, నిర్మాణం, కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “జగదేకవీరుడు అతిలోకసుందరి” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. సత్యానంద్, జంధ్యాల వంటి సీనియర్ రచయితలు సోషియో ఫాంటసీ కథను తయారు చేయగా, కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించి సినిమాను నభూతో నభవిష్యత్ అనే విధంగా రూపొందించారు. ఇళయరాజా స్వరపరిచిన “అమ్మనీ తీయని దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బా”.. 1990లో వచ్చిన ఈ పాట ఆంధ్రదేశమంతటా మార్మోగింది. శ్రీదేవి దేవకన్యగా ఎంతో అత్యద్భుతంగా నటించారు. చిరంజీవి,రాఘవేంద్రరావు కాంబినేషన్లో అనేక చిత్రాలు వచ్చినప్పటికీ “జగదేకవీరుడు అతిలోకసుందరి” చిత్రం మొదటి ఇండస్ట్రీ హీట్ గా నిలిచింది. చిరంజీవి అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ బాలయ్య బాబు ఇష్టపడిన చిత్రంగా జగదేకవీరుడు అతిలోకసుందరి నిలిచిపోతుంది.































