Balakrishna: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ చిత్ర పరిశ్రమలోను ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని చెప్పాలి.బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని తొక్కినేని అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇలా ఈ విషయంపై అక్కినేని వారసులు నాగచైతన్య అఖిల్ కూడా స్పందించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందించారు.
ఈ క్రమంలోనే తాజాగా హిందూపురంలో పర్యటించిన బాలయ్య అక్కినేని వివాదం పై స్పందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఈయన చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ ఎవరిని కించపరచాలని తాను మాట్లాడలేదని తెలిపారు.నేను ఏఎన్ఆర్ గారిని బాబాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తాను తన పిల్లల కన్నా ఆయనకు నేనంటేనే చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు.

Balakrishna: ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు లాంటివారు..
తన తండ్రి ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకోగా తన బాబాయ్ ఏఎన్ఆర్ గారి నుంచి పొగడ్తలకు పొంగి పోకూడదు అనే విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారు.నాన్న చనిపోయిన తర్వాత ఆయన పేరు పై జాతీయ అవార్డును ప్రకటించడంతో ఆ అవార్డును మొదటిసారిగా ఏఎన్ఆర్ గారికి అందించామని తెలిపారు.ఆయనపై ప్రేమ ఇప్పటికీ నా గుండెల్లో అలాగే ఉంది బయట ఏం జరిగినా తనకు సంబంధం లేదని ఈ సందర్భంగా బాలకృష్ణ అక్కినేని వివాదం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
It’s been almost 13 years so naturally, they forgot.#NandamuriBalakrishna pic.twitter.com/NlHjjgANCr
— Balayya Trends (@NBKTrends) January 24, 2023































