Balakrishna : అఖండ విజయంతో బాలయ్యబాబు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ వస్తున్నాడు.బాలయ్య బాబు పని అయిపోయింది అని అనుకున్నవాళ్ళు షాక్ అయ్యేలా అఖండా తో బాక్సఆఫీస్ అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇక ఓటీటీ ప్లాట్ ఫారం లోనూ తన సత్తా చూపించి మరే హీరోను సాధించినటువంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఆహా ఒరిజినల్స్ లో అన్ స్టోపాబుల్ షో తో ఇండియా లోనే టిఆర్పి లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలకృష్ణ .ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే వీరికి సంబందించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
ఇక సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను ఉగాది నాడు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపి అభిమానులకు పండగ గిఫ్ట్ ఇచ్చేసారు. ఇక సినిమా పేరును కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ కు జోడిగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది. సిరిసిల్ల ప్రాంతంలో ఈ సినిమా కు సంబందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.ఇక బాలయ్యబాబు ఈ సినిమా లో తెలంగాణ యాస లో మాట్లాడుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.



























