కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగులని తిరిగి తొందరలోనే మొదలు పెట్టాలని చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిని, ఆ తరువాత సిఎం కెసిఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ మీటింగ్ కి తనని పిలువలేదని, ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ హీరో బాలకృష్ణ కామెంట్స్ చేయడం పెద్ద సంచలనాన్నే సృష్టించాయి.

బాలయ్య చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ అయ్యి బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి మీరు ఏం కింగ్ కాదు జస్ట్ హీరో అంతే.. అంటూ నాగబాబు కౌంటర్ వేశారు. ఇక టీడీపీ పైన కూడా నాగబాబు కామెంట్స్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో నాగబాబుని కొందరు సపోర్ట్ చేయగా మరికొందరు ట్రోల్ చేశారు.

అయితే నాగబాబు వ్యాఖ్యలపై తాజాగా మన లెజెండ్ బాలకృష్ణ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన బాలకృష్ణను నాగబాబు వ్యాఖ్యలు పై మాట్లాడమనగా.. “ఛీ..ఛి.. ఆ విషయంపై ఇక మాట్లాడదలుచుకోలేదు. నన్ను వేరుగా చూస్తే నాకు తిక్క రేగుతుందంతే తప్ప నాగబాబు నాకూ మధ్య గొడవలు ఏమీ లేవు ఆయనే అన్ని మాట్లాడుతున్నాడని బాలక్రిష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నేను ఎవరికీ భయపడను, నా వ్యక్తిత్వం గురించి నాకు భయం లేదు. నాకు ఎవరైనా మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాల్సిందే. ఇండస్ట్రీలో ఎవరైనా మా వంశాన్ని ఫాలో కావల్సిందే.. చరిత్ర సృష్టించాలన్న మేమే.. దాన్ని తిరగరాయాలన్న మేమే అంటూ సింహా సినిమాలోని డైలాగులను చెప్పుకొచ్చారు బాలయ్య.????



























