స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తీసిన రెండు సినిమాలలో నటించారు నందమూరి బాలకృష్ణ. అయితే ఆ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్ గా ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే మరోసారి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా పుస్తకం రాసేందుకు సిద్దమయ్యారు.

ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు బాలయ్య. ఈ నేపద్యంలో అయన తండ్రి ఎన్టీఆర్ తో ఉన్న మధుర జ్థాపకాలను గుర్తుచేసుకుంటూ. తాను ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని, నెక్స్ట్ తరం గుర్తుండేలా..వారు అనుసరించేలా పుస్తకం రాస్తాను. ప్రభుత్వం ఎన్టీఆర్ జీవిత కథలోని అంశాలను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో “అఖండ” చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఇటీవలే విడుదలైన అఖండ టీజర్ కు భారీ స్పందన వచ్చింది.
































