ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. దాంతో అందరి చూపులు ఇప్పుడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞపై పడ్డాయి. ఈ లోటు భ‌ర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌న్ ఆఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు.

ఇప్ప‌టికే 21 ఏట అడుగు పెట్టాడు మోక్షు. ఇండ‌స్ట్రీలో చాలామంది వార‌సులు ఇదే వ‌య‌సులోనే హీరోలుగా వ‌చ్చారు. చ‌ర‌ణ్ 21 ఏళ్ల‌కు “చిరుత‌”.. అఖిల్ 20 ఏళ్ల‌కే “అఖిల్”.. ఎన్టీఆర్ అయితే 16 ఏళ్ల‌కే “నిన్ను చూడాల‌ని”.. మ‌హేశ్, ప‌వ‌న్ 25 ఏళ్ల‌కు.. బ‌న్నీ 20 ఏళ్ల‌కు “గంగోత్రి”.. ప్ర‌భాస్ 22 ఏళ్ల‌కు “ఈశ్వ‌ర్”.. ఇలా ప్ర‌తీ హీరో చాలా త‌క్కువ వయసులోనే వ‌చ్చారు. దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా త్వ‌ర‌లోనే వార‌సున్ని ప‌రిచ‌యం చేస్తానంటున్నాడు. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ న‌ట‌న‌తో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు. బాల‌కృష్ణ డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వార‌సుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు. అందుకే ఈ విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ వార‌సుడు.

మోక్షజ్ఞ ఎప్పుడొచ్చినా కూడా త‌నే సినిమా నిర్మిస్తాన‌ని సాయి కొర్ర‌పాటి చెబుతున్నాడు. కానీ., బాల‌య్య మాత్రం తన కొడుకు సినీ రంగ ప్రవేశం గురించి తీవ్రంగా ఆలోచించి మోక్షజ్ఞని హీరోగా వచ్చే ఏడాది సంక్రాంతి కి భారీ స్థాయిలో లాంచ్ చెయ్యాలి అని నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ గానే నిర్ణయం తీసుకున్నాడని, మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇప్పటి నుండే కసరత్తులు మొదలు పెట్టి, మోక్షజ్ఞ స్లిమ్ గా తయారు అవ్వడానికి జిమ్ వర్క్ ఔట్లు ప్రారంభించినట్టు తాజా సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పుడు మోక్షజ్ఞ మొదటి సినిమాకి దర్శకుడు ఎవరనే ప్రశ్న టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ కి “సింహ”, “లెజెండ్” వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ప్రస్తుతం బాలకృష్ణ తన తర్వాత చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తైన తర్వాత మోక్షజ్ఞ ని టాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నట్టు తెలిసింది. అలాగే మరోవైపు బాలకృష్ణ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన కొడుకుని లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నదంట. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత” సినిమాతోనే రామ్ చరణ్ ని స్టార్ హీరోని చేసేసాడు పూరి జగన్నాథ్. అలాగే మోక్షజ్ఞ తో పూరీ జగన్నాథ్ సినిమా తీస్తే రామ్ చరణ్ స్థాయిలో అతనిని నిలబెట్టగలడా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి. ఇంతకీ ఫైనల్ గా మోక్షజ్ఞ మొదటి సినిమాకి దర్శకుడు ఎవరనే సంగతి తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరుకు ఆగాల్సిందే మరి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here