బర్త్ డే రోజున బాలయ్య మరో వివాదానికి తెర లేపారు. ఆ వివాదమేమిటో పై హెడ్డింగ్ చదివినవాళ్ళకు ఈపాటికి అర్ధమయ్యే వుంటుంది. ఇంతకీ ఈ అర్హత ఏమిటి.?అర్హత లేని స్టార్స్ ఏంటి.? అసలు బాలయ్య గోలేంటి.? అనుకుంటున్నారా..! మీ సందేహాలన్నిటికీ సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ ను మీరు పూర్తిగా చదవాల్సిందే.!

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య కరోనా వైరస్. పెద్దా,చిన్నా.. ధనికా,పేదా అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ వచ్చేస్తుంది. అందరిపై కరోనా తన ప్రతాపం చూపించేస్తుంది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో షూటింగ్ లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.! దాంతో మన స్టార్ హీరోలతో పాటు కొందరు దర్శక నిర్మాతలు 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశమౌతూ షూటింగ్స్‌కు అనుమతులు కావాలంటూ తిరుగుతున్నారు. వీరిలో ముఖ్యంగి చిరంజీవి, నాగార్జున చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు. మరోవైపు నాగార్జున కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. వీళ్ళతో పాటు రాజమౌళి లాంటి దర్శకులు.. దిల్ రాజు, సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. టాలీవుడ్ లో కొందరికి షూటింగ్ లో పాల్గొనే అర్హత లేదు. ఎందుకంటే..

చిన్న పిల్లలను, 60 ఏళ్లు దాటిన వాళ్లను బయటికి రావద్దని అటు ప్రభుత్వం, ఇటు ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా 60 దాటినవాళ్లు, చిన్నారులు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. మరి వీళ్ళ సూచనలను గనుక పరిశీలిస్తే.. ప్రస్తుతం చిరంజీవి వయసు 64 ఏళ్లు.. నాగార్జున, వెంకటేష్ వయసు కూడా 60 ఏళ్లు.. వాళ్లతో పాటు మరికొందరు సినీ ఆర్టిస్టుల వయసు కూడా 60 దాటేసింది. కాబట్టి వీళ్ళందరూ షూటింగ్‌కు అనర్హులే కదా.! కాస్త లాజిక్ గా ఆలోచించండి. సరిగ్గా ఇదే లాజిక్ ను మన బాలయ్యబాబు కూడా తన బర్త్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. కరోనా మహమ్మారి ఇంత దారుణంగా జనాలను భయపెడుతుంటే షూటింగ్స్ ఎలా చేసుకుంటారని టాలీవుడ్ పెద్దలను ఆయన సూటిగా ప్రశ్నించాడు. అందుకే అర్హత లేని స్టార్స్‌కు అంత ఆతృత ఎందుకు.? అంటూ సోషల్ మీడియాలో బాలకృష్ణ లాజిక్ కు అనుగుణంగానే సెటైర్ లు వేస్తున్నారు నెటిజన్లు. ఇంతవరకూ బాగానేవుంది కానీ ఇంతకీ ఇప్పుడు బాలయ్య వయస్సెంతో..?!☺️????????????



























