నందమూరి బాలయ్య వెండతెరపై తన డైలాగ్స్, నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండతెరపైనే కాకుండా ఇటీవల అతడు తొలిసారిగా డిజిటల్ టాక్ షో అన్‌స్టాపబుల్‌కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో తొలి ఎపిసోడ్‌కు మంచు మోహన్‌బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీకరించి ఆహాలో టెలికాస్ట్ కూడా అయిన విషయం తెలిసిందే.
దీనిని దీపావళి కానుకగా ప్రసారం చేశారు. ఈ రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురి పేర్లు వినిపించగా చివరకు నాని రెండో ఎపిసోడ్ కు గెస్ట్‌గా వచ్చారు. తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ షో నవంబర్ 12 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీనిలో నాని, బాలయ్యకు మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి.
దీనిలో బాలయ్య నాని.. నీవు గల్లీ క్రికెట్ ఆడుతావా అని అడుగుతా.. దానికి నాని అవును అని సమాధానం ఇస్తాడు. తాను సెట్‌లో క్రికెట్ ఆడుతానంటూ బాలయ్య చెప్పాడు. ప్రోమో చూస్తుంటే ఇది కూడా మంచి ఎంటర్‌టైన్ అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి అనుబంధం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.
నాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించారు. ఇందులో అతని చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా ఉంది. దీంతో బాలయ్యతో ఎపిసోడ్ ఓ రేంజిలో ఉండనుందనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ విషయమై నెటిజన్లు బాలయ్యతో నాని అనుబంధం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…