ఈరోజు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టినరోజు.. అయన జన్మదిన సందర్భంగా సరికొత్త సినిమా అప్‌డేట్స్ తో అభిమానులలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. క‌రోనా నేపధ్యంలో త‌న బ‌ర్త్‌డేని పురస్కరించుకుని ఎవరూ కలవడానికి రావద్దని ముందుగానే అభిమానులను రిక్వెస్ట్ చేసిన బాలయ్య. తన బర్త్ డేని చాలా సింపుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్న‌ట్టు ఇది వరకే తెలిపారు బాల‌య్య. అయన పుట్టినరోజు వేడుకలో భాగంగా నిన్న అఖండ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా కొద్దిసేప‌టి క్రితం గోపిచంద్ మ‌లినేని సినిమా అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు.

అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందంటూ విడుద‌ల చేసిన వీడియో ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది. తాజాగా క్రాక్ సినిమా హిట్ తో మంచి ఊపుమీదున్న గోపిచంద్ మ‌లినేని.. ఇక బాల‌య్య‌తో క‌లిసి మరో బ్లాక్ బస్టర్ కోసం ప్లాన్ చేసాడు. ఈ నేపధ్యంలో గోపీ.. బాల‌య్య‌ని రెండు విభిన్న పాత్రలలో డ్యూయల్ రోల్ లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరియు ఫ్యాక్షనిస్ట్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here