Balayya – Venkatesh : ధర్మం నాలుగు పాదాల మీద నడవాలంటే.. రాజ్యాంగ ప్రకరణలు పక్కాగా అమలు కావాలంటే.. భారత శిక్షాస్మృతి ధనవంతులకు దాసోహం కాకూడదంటే.. నల్లకోటు వేసుకున్న న్యాయవాదులు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిందే. కమర్షియల్ చిత్రాల పరంపరలో నల్లకోటుతో కూడుకున్న అనేక కథలు బాక్సాఫీసు వద్ద విజయదుందుభి మోగించాయి. 1982లో నందమూరి తారక రామారావు.. జస్టిస్ చౌదరి చిత్రంలో నల్లకోటుతో అభాగ్యుల ఆక్రందనలు, నిరుపేదల రోదనలు తీర్చి,న్యాయస్థానాల ఉనికిని కాపాడారు. ఆ తర్వాత అనేక చిత్రాలు నల్లకోటు బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్నాయి. అలా దివ్యభారతితో బాలకృష్ణ వకీల్ సాబ్ గా నటించిన ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

“ధర్మక్షేత్రం” 1992 లో విడుదలైన తెలుగు భాషలో విడుదలైన చట్టపరమైన మరియు యాక్షన్ చిత్రం , దీనిని శ్రీ రాజీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై KC రెడ్డి నిర్మించారు. మరియు A. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, దివ్య భారతి నటించారు.ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా స్వరాలు సమకుర్చారు. సంక్షిప్తంగా కథ ను గమనిస్తే..

బెనర్జీ, దుర్గాప్రసాద్ మరియు పాండు అనే ముగ్గురు వ్యక్తుల గురించి కథ కొనసాగుతుంది. వారిలో ఇద్దరు (ప్రసాద్ మరియు పాండు) రాజకీయాల్లో చేరి స్నేహితులుగా మారినప్పుడు సమస్యలు మరియు చిక్కులు తలెత్తుతాయి. బెనర్జీ చట్టాన్ని గౌరవించే పౌరుడు, అతను చట్టాన్ని విశ్వసిస్తాడు మరియు సత్యం యొక్క సరైన మార్గంలో న్యాయాన్ని రక్షించడానికి అన్ని అసమానతలతో పోరాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

వకీల్ సాబ్ గా విక్టరీ వెంకటేష్ ఒక చిత్రంలో నటించారు. “ధర్మచక్రం” 1996 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ కు నంది అవార్డ్ వరించింది.ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. అప్పటి దాకా కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా.
రాకేష్ ఒక న్యాయవాది. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు. తల్లి శారద. రాకేష్ సురేఖ అనే మధ్య తరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది అతని తండ్రికి నచ్చదు. ఆమెను వేశ్యగా చిత్రీకరించి ఆమె మరణానికి కారణమవుతాడు. దాంతో రాకేష్ తండ్రిని అసహ్యించుకుని వైరం ఏర్పరుచుకుంటాడు. తల్లి శారద భర్త, కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. రాకేష్ కు తల్లి మాటంటే వేదవాక్కు. ఆమె తనయుడి ఆవేశాన్ని నియంత్రిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. 1996లో విడుదలైన “ధర్మచక్రం” సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఆడింది.
































