Bandaguda car accident : రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా కూడా ఎదుటివారి అజాగ్రత్త మన ప్రాణాలకు ముప్పు తేవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక ఆక్సిడెంట్ లో అలానే ఇద్దరు ఉదయం వేళ వాకింగ్ కి వెళ్లిన వారి ప్రాణాలను తీసింది. అతివేగంతో వస్తున్న కారు వేగంగా డీ కొట్టడంతో అక్కడికక్కడే తల్లికూతుర్లు చనిపోగా మరో ఇద్దరు హాస్పిటల్ లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు.

యాక్సిడెంట్ చేసి పార్టీ చేసుకున్న ఖాదీర్…
హైదరాబాద్ శివార్లలోని బండగూడ జాగిర్ సన్ సిటీ వద్ద మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన అనురాధ 38 సంవత్సరాలు, కూతురు మమత ను వేగంగా కారు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. కారు నడిపిన వ్యక్తి వివరాలను తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. 19 ఏళ్ల బబ్రుద్ధిన్ ఖాదీర్ అనే యువకుడు మైనారిటీ తీరిందనే ఆనందంతో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. రాత్రంతా మందు తాగి పార్టీ చేసుకుని ఉదయం వేరొక చోట స్నేహితులకు పార్టీ ఇవ్వడం కోసం హోండా సిటీ కారును వేసుకుని బండగూడ వైపు వెళ్ళాడు.

అతివేగంగా వెళ్తున్న అతనికి నలుగురు వ్యక్తులు దగ్గరికి వచ్చేవరకు కనిపించలేదు. దగ్గరికి వచ్చాక బ్రేక్ వేసినా ఎదురుగా రోడ్డులో మట్టి ఉండటం వల్ల కారు వేగంగా ఇద్దరు తల్లికూతుళ్ళను కొట్టేసింది. అక్కడిక్కడే వారిద్దరూ మరణించగా మరో ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే ఖాదీర్ కారు నుండి దిగి పారిపోయి స్నేహితులకు ఫోన్ చేసి మరో కారులో ఫామ్ హౌస్ చేరుకున్నాడు. ఆక్సిడెంట్ చేసానన్న భయం కానీ బాధ కానీ లేకుండా స్నేహితులతో కలిసి మందు తాగాడు. పోలీసులు విచారించగా కారును ఓఎలెక్స్ లో కొనుగోలు చేసాడని తెలిసింది. ఇంకా కారు పాత ఓనర్ పేరు మీదే ఉంది. అలాగే ఖాదీర్ కి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం పోలీసులకి ఆశ్చర్యం కలిగించింది.































