Bandla Ganesh : సినిమా నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గారి అనుబంధం అందరికీ తెలిసిందే. తనని తాను పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్ల గణేష్ చెప్పుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ కి అయితే ఫ్యాన్స్ మామూలుగా ఎదురుచూడరు. ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలకు బండ్ల హాజరు కావడం లేదు కానీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఎంత అభిమానూలు ఎదురుచూస్తారో ఆ తరువాత బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎదురుచూస్తారు. ఈ భక్తుడికి ఆ భగవంతుడికి మధ్య గ్యాప్ వచ్చింది. అయినా ఈ భక్తుడు మాత్రం సోషల్ మీడియాలో పీకే గురించి పోస్ట్లు పెడుతూ అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటాడు.

ముద్దొస్తున్నాడు… ఒక ఛాన్స్ బాస్…
తాజాగా రెడ్ టీ షర్ట్ లో పవన్ కళ్యాణ్ కూర్చొని ఏదో సీరియస్ గా వింటున్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో బండ్ల గణేష్ షేర్ చేసాడు. ఇక అందులో మా బాస్ ముద్దొస్తున్నాడు అంటూ రాసుకోచ్చాడు. ఒక్క ఛాన్స్ అంటూ తన బాస్ కి అర్జీ కూడా పెట్టుకున్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే 1000 కోట్ల మార్కెట్ దాటితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ రాసుకోచ్చాడు. ఇక బండ్ల షేర్ చేసిన ఫోటో ‘హరిహర వీరమల్లు’ సినిమా కథ వినే సమయంలో తీసినదిగా తెలుస్తోంది.

అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే
— BANDLA GANESH. (@ganeshbandla) September 30, 2022
గుండెల్లో దడ దడ మొదలయ్యింది
రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్ @PawanKalyan ❤️ pic.twitter.com/ft9oyx1j9J
హిస్టరికల్ డ్రామాగా రాబోతున్న హరి హార వీరమల్లు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి సారి ఈ సినిమాలో పవన్ ఒక జానపద సినిమా గెటప్ లో కనువిందు చేయనున్నాడు. బందిపోటుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే సిద్ధం అవుతున్న పవన్ మరి తమ భక్తుడికి వరం ఇస్తాడో లేదో చూడాలి.



































