Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తన సినిమాల గురించి సినిమా నిర్మాణం గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.

ఎన్టీఆర్ కి నాకు గ్యాప్ కి కారణం…
బండ్ల గణేష్ 2011 నుండి 2017 వరకు పెద్ద హీరోలతో వరుస హిట్లను చూశానంటూ తెలిపారు. తాను ఎన్టీఆర్ పవన్ లకు అప్పటి వరకు ఫ్లాప్స్ చూసినా ఆ ఇద్దరికీ జీవితంలో మర్చిపోలేని హిట్లను ఇచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్స్ ఉన్న సమయంలో ‘టెంపర్’ మంచి హిట్ ఇచ్చి కెరీర్ కు ప్లస్ అయిందని ఆ సినిమా తరువాత వరుస హిట్లను చుసాడని తెలిపారు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం తాను తీసుకున్న జాగ్రత్తలే అంటూ చెప్పిన బండ్ల గణేష్ ఇక ఎన్టీఆర్ కూ తనకు గ్యాప్ రావడానికి కారణాలేమి లేవంటూ తెలిపారు. నేను సినిమా మళ్ళీ తనతో చేయాలనుకుంటే చేస్తానని, నేను నిర్మాణం వైపు ఆలోచించలేదు అంతే తప్ప మా మధ్య గ్యాప్ లేదంటూ తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ కున్న సత్తాను ‘గబ్బర్ సింగ్’ సినిమాతో చూపానని అలా పవన్ ఎన్టీఆర్ ఇద్దరికీ జీవితంలో మర్చిపోలేని హిట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇక పూరికి బండ్ల గణేష్ కి మధ్య ఉన్న గ్యాప్ గురించి మాట్లాడుతూ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పడం తప్పించి మా మధ్య ఎలాంటి విబేధాలకూ తావు లేదని వివరించారు. పూరీ కుటుంబం అంటే నా సొంత కుటుంబం అంటూ తెలిపారు.



























