బండ్ల గణేష్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ మధ్య ఎన్నికల సమయంలో ఈయన చేసిన రాజకీయ వ్యాఖ్యానాలకి సోషల్ మీడియాలలో ఎదురుదెబ్బలు తిని సడన్‌గా కామ్ అయిపోయిన బండ్ల గణేష్.. పాపం.. ఇప్పడు మళ్ళీ మరోసారి పబ్లిక్‌గా పోలీసులకి, తర్వాత సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా నెటిజన్లకి దొరికిపోయి పూర్తిగా అభాసుపాలయ్యాడు.

మాస్క్ పెట్టుకోని కారణంగా పోలీసులు పట్టుకుని రెండు వేల రూపాయలు జరిమానా కట్టించేసిన ఎవరిదో రిసిప్ట్‌ని పోస్ట్ చేసిన బండ్ల.. తనకు ఏమాత్రం రాని ఇంగ్లీష్ భాషలో.. ముందు where mask అని ఏ మాత్రం తడుముకోకుండా తగిలించేశాడు. దెబ్బకి దొరికిపోయాడు. ఒక్కసారిగా పొలోమని నెటిజన్లు విరుచుకుపడ్డారు బండ్లమీద అమాంతంగా. తప్పు తెలుసుకుని స్పెల్లింగ్ మార్చి మళ్ళీ మరోసారి మరో బండబూతు ఇంగ్లీష్ మాటని పెట్టాడు. అదేంటయ్యా అంటే ware mask అని. మరి నెట్ వీరులు ఊరుకుంటారా. మళ్ళీ చెడుగుడు ఆడేశారు. ”బాబూ. బండ్లబాబూ. నీ దిక్కుమాలిన ఇంగ్లీష్ భాషని భరించలేకపోతున్నాం.. మాకొచ్చిన ఆంగ్లం కూడా మరచిపోయేట్టు చేస్తున్నావు.. ఎందుకు రాని ఇంగ్లీష్‌లో ఆ ఏడుపు. నీ కామెడీని భరించలేకపోతున్నాం. ఇంగ్లీష్ పరువు తీయకురా బాబూ..” అనే కామెంట్స్‌తో కుమ్మేశారు.
Ware mask ???? @besafe @CPHydCity @DCPWZHyd pic.twitter.com/v8DEWaeP1T
— BANDLA GANESH. (@ganeshbandla) March 29, 2021
తను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా రాజకీయనాయకుల అండ, మెగాఫ్యామిలీ దండ తనకి ఉందనే అపోహలో, భ్రమలో.. ఫంక్షన్స్‌లోనూ, టీవీ ఛానెల్స్‌లోనూ ఇష్టానికి రెచ్చిపోయి మాట్లాడి, పరిస్థితులు ఎదురు తిరగ్గానే నాలిక కరుచుకుని నోరు మూసుకున్న బండ్ల గణేష్‌బాబు సోషల్ మీడియా ఎదురుగా ప్రత్యక్షమవగానే, దాని ద్వారా లైవ్‌లో ఉండాలీ అనే అనవసర ఉత్సాహంతో మరింత నవ్వుల పాలవడం బండ్ల గణేష్ కి పలు మార్లు ఎదురవుతూనే ఉంది.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు.. బండ్ల గణేష్ బట్లర్ ఇంగ్లీష్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!



























