ఒక సినీ నిర్మాతగా, కమెడియన్, ఇలా రకరకాలుగా తన జీవనాన్ని కొనసాగించిన బండ్ల చివరిగా రాజకీయాల్లో సెటిల్ అయిపోయాడనుకున్నారు.. కానీ., అనుకున్నదొక్కటి అయినదోక్కడి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం బండ్ల గణేష్ పరిస్థితి. సీన్ మొత్తం కూడా రివర్స్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నా దేవుడు అతనే నా రక్ష అనుకుంటూ తిరిగిన బండ్ల గణేష్ జనసేన పార్టీ లో చేరి పవన్ కి అండగా నిలుస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కాని చివరికి ఢిల్లీ వెళ్లి మరి రాహుల్ తో చేతులు కలిపి కాంగ్రెస్ కండువా కప్పుకొని పొలిటికల్ పార్టీలన్నింటికీ షాకిచ్చాడు. సరే అతను ఏదో ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టాడు, కానీ అక్కడ మరేదో జరుగుతుంది.

కాంగ్రెస్ లో చేరిన కొన్ని రోజుల తర్వాత “బండ్ల గణేష్ అనే నేను” అంటూ ప్రమాణ స్వీకారం చేద్దామని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ధీమాను వ్యక్తం చేశారు. కాని బండ్ల గణేష్ కి రాహుల్ ఆ ఛాన్స్ ఇవ్వనేలేదు. అదంతా చూసిన బండ్ల గణేష్ కి బీపీ పెరిగిపోతుందట, మొద‌ట జాబితాలోనే త‌న పేరు ఉంటుంద‌ని ఆశించారు బండ్ల గ‌ణేష్. కానీ, ఆ 65 మందిలో తన పేరు క‌నిపించ‌లేదు. దీంతో రెండో జాబితాగా వ‌చ్చిన 10 మందిలో కూడా బండ్ల గణేష్ ప్రస్తావ‌న లేదు. అయితే బండ్ల గణేష్ మొదటినుండి కూడా షాద్ నగర్ నుండి పోటి చెయ్యాలని అక్కడ సీట్ దక్కించుకోవాలనుకున్నారు కాని అక్కడ కూడా మొండి చెయ్యే మిగిలింది, తాజాగా విడుదల చేసిన జాబితాలో షాద్ నగర్ సీట్ ని ప్రతాప్ రెడ్డి కి కేటాయించారు దాంతో బండ్ల గణేష్ కి బీపీ పీక్స్ లోకి వెళ్లిందట. ఇక మిగిలిన మూడో జాబితాలో రాజేంద‌ర్‌న‌గ‌ర్ కింద త‌న పేరు ఉంటుందో లేదోనన్న భ‌యం బండ్ల గ‌ణేష్‌ని వెంటాడుతోంది. దూరపు కొండలు నునుపు అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న పార్టీలను పక్కన పెట్టి ఎక్కడికో వెళ్లి వాళ్ళతో చేతులు కలిపి చివరికి మొండి చెయ్యి చూపించుకునేలా చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేష్ నుద్దేశించి “అన్నా.. బీజేపీలో చేరుతున్నావా?” అని ఆ నెటిజన్ అడగడంతో బండ్ల గణేష్ ఒక్కసారిగా పరేషాన్ షాకయ్యి ఆ నెటిజన్ కి బదులిస్తూ.. సింపుల్‌గా ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అంటూ చేతులెత్తి దండం పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాజకీయాల మాటెత్తితేనే మనోడు వణికిపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత ఎన్నో సందర్భాల్లో తాను రాజకీయాలకు దూరమవుతానని బండ్ల గణేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈమధ్యనే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో 7’O క్లాక్ బ్లేడ్ బ్యాచ్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ తర్వాత.. ఇక కెమెరా ముందు కూడా కనిపించనని నిర్మొహమాటంగా చెప్పేశారు. తన దృష్టి మొత్తం సినిమా నిర్మాణం పైనే పెడతానని, తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మరో ఛాన్స్ ఇస్తే మరో భారీ సినిమా తీస్తానని ఈ సందర్భంగా తెలియజేశాడు. సో.. బండ్ల గణేష్ ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి వేచి చూడాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here