ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం హాస్పిటల్ కి వెళ్లగా అక్కడి వైద్యులు కరోనా టెస్ట్ చేసుకోవాలని సలహా ఇవ్వడంతో వెంటనే బండ్ల గణేష్ టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే.. చావు భయం తొలిసారి కళ్ళ ముందు కనిపించింది. దాంతో వెంటనే ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. 12రోజుల చికిత్స తర్వాత తాజాగా ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా నుండి కోలుకోవటంతో ఆయన ఆనందంతో ‘థాంక్ గాడ్’ అంటూ తన రిపోర్ట్స్ ను షేర్ చేసారు.

ఇక బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకోవటంతో ఆయన ఫ్యాన్స్ “మా బండ్లన్న సేఫ్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా బండ్ల గణేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరోనా చికిత్స టైంలో ఎలాంటి ఆహారం తీసుకున్నారు.. ఏ ఏ మందులు వాడారన్న అంశంపై వివరణ ఇచ్చారు. కరోనా నివారణకు ప్రత్యేకించి ట్రీట్‌మెంట్ అంటూ ఏం లేదు.. తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మొదట్లో నాకు కరోనా పాజిటివ్ అని తెలిసి చాలా భయపడ్డాను. అయితే రోజూ గుడ్లు, శొంఠి, అల్లం, వెల్లుల్లి, వేడి నీళ్లు తీసుకునేవాడిని. అంతే 12 రోజుల్లో నెగిటివ్ వచ్చేసింది. రోజూ 7 గుడ్లు తినేవాడిని. ప్రతి రోజూ శొంఠి రసం తాగేవాడిని. ఇవి తీసుకుంటే చాలు. ఆసుపత్రి చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఇచ్చుకోవల్సిన అవసరం లేదు’ అని బండ్ల గణేష్ తెలియజేశారు.




























