Bangalore lovers death mystery : సోలో లైఫ్ సో బెటర్ అంటూ బతికేస్తున్న చంద్ర శేఖర్ అనే 30 ఏళ్ల వ్యక్తి జీవితంలోకి అనుకోకుండా తన కింద పనిచేసే ఉద్యోగిగా సుధారాణి పరిచయం అయింది. ఇక చూపులు కలిసి ప్రేమ చిగురించి ఇద్దరూ ప్రేమపక్షుల్లా తిరిగారు. అయితే పెళ్లి చేసుకుందాం అనుకునే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. వీరిని పెద్దలు వేరు చేసారా అందుకే ఆత్మహత్య చేసుకున్నారా అంటే అదేమీ కాదు. వాళ్ళ పొరపాటు వల్లే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

డేంజర్.. వాటర్ గీజర్…
బెంగళూరులోని ఒక స్టార్ హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్ర శేఖర్ అదే హోటల్ లో పనిచేస్తున్న బెళగావికి చెందిన సుధారాణి ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమ పక్షుల్లాగా బెంగళూరు అంతా చుట్టేసారు. ఇక ఇద్దరి మధ్య ప్రేమ ముదిరాక చంద్ర శేఖర్ ఖర్చు ఎందుకు అంటూ సుధారాణిని తన రూమ్ కి షిఫ్ట్ అవ్వమని చెప్పడంతో ఆమె కూడా లివింగ్ రిలేషన్ కి ఒప్పుకుంది. అలా హ్యాపీగా సాగుతున్న జీవితంలో ఒకసారి బెళగావి నుండి సుధారాణి తండ్రి బెంగళూరు రావడం, అక్కడ వీరిని చూడటంతో ఆమెను ఉద్యోగం ఏమీ వద్దు పెళ్లి చేసుకో అని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇక చంద్రశేఖర్ కి విషయం తెలిసి సుధ కోసం వాళ్ళ ఊరు వెళ్లి పెద్దలనొప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు.

అయితే అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో చంద్ర శేఖర్ సుధ ను బాత్రూంలో కలిసి స్నానం చేద్దామనే వింతకోరిక కోరడంతో అది వాళ్ళ చావుకు కారణం అయింది. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి అనగా చంద్ర శేఖర్ ఇలాంటి ఒక వింత పని చేద్దామని అడగడంతో సుధ కూడా నో చెప్పలేదు. అలా ఇంట్లో తలుపులు కిటికీలు పూర్తిగా క్లోజ్ చేసుకుని బాత్రూంలో ఇద్దరూ కలిసి స్నానం కోసం వెళ్లడం, గీజర్ ఓవర్ హీట్ అయి అందులోనుండి కార్బన్ మోనక్సైడ్ వాయువు ఇల్లంతా వ్యాపించడంతో ఊపిరి ఆడక అక్కడే పడి ఇద్దరూ మరణించారు. రెండు రోజులు దాటినా ఆఫీస్ కి రాలేదని ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూస్తే నగ్నంగా ఇద్దరి శవాలు దొరికాయి. అలా వింత ఫాంటసీ వాళ్ళ ప్రాణాలను తీసింది.































