అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఒక బార్బర్ ను చూస్తే ఈ మాట నిజమేనని అనిపిస్తుంది. ఒక బార్బర్ కు ఒక వ్యక్తికి కటింగ్, షేవింగ్ చేసినందుకు 60 వేల రూపాయలు దక్కింది. వినడానికి కొంత వింతగానే ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే కట్టింగ్ చేయించుకున్న వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. అధికార పార్టీ మంత్రి అయిన సదరు వ్యక్తి కటింగ్, షేవింగ్ చేసిన బార్బర్ కళ్లల్లో ఆనందం నింపాడు.

పూర్తి వివరాల్లోకి వల్ల కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గత కొన్ని నెలలుగా ప్రజా ప్రతినిధులు బహిరంగ సభలను ఏర్పాటు చేయడం లేదు. ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానించినా వాటికి హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. కార్యక్రమాలకు హాజరైతే వైరస్ తమకు ఎక్కడ సోకుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం ఖండ్వా జిల్లా గులైమాల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు.

కార్యక్రమంలో భాగంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు కీలక సూచనలు చేశాడు. ఆ సమయంలో రోహిదాస్ అనే బార్బర్ అక్కడికి వచ్చి కరోనా, లాక్ డౌన్ వల్ల తన పరిస్థితి ఏం బాగాలేదని తనకు షాపు పెట్టుకోవడానికి సహాయం చేయాలని కోరాడు. మంత్రి తనకు కట్టింగ్, షేవింగ్ చేయాలని నైపుణ్యాన్ని పరిశీలించి సాయం చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

రోహిదాస్ వెంటనే ఫేస్ మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుని కటింగ్, షేవింగ్ చేశాడు. అనంతరం ముఖాన్ని అద్దంలో చూసుకున్న మంత్రి బార్బర్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. ఆ తరువాత 60 వేలు ఇచ్చి షాపు పెట్టుకోవాలని మంత్రి సూచించడంతో రోహిదాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల చాలామంది సెలూన్లకు వెళ్లాలంటే భయపడుతున్నారని… అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఉండవని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here