ములుగు: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లా పర్యటనలో స్వల్ప అసౌకర్యం ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన ఆమెకు స్వాగతం పలుకుతూ మహిళా సంఘం సభ్యులు కూరగాయలతో పేర్చిన బతుకమ్మను అందించారు.

ఆ బతుకమ్మను తలపై పెట్టుకుని సభా వేదికకు వెళ్తుండగా, అది అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది.
మంత్రి సీతక్క తలపై నుంచి కిందపడిన బతుకమ్మ !
— TeluguDesk (@telugudesk) July 17, 2025
ములుగు జిల్లా గిరిజన భవనంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వాగతం సందర్భంగా మహిళా సంఘం సభ్యులు కూరగాయలతో తయారుచేసిన బతుకమ్మను ఆమె తలపై పెట్టగా, సభా వేదిక వైపుగా… pic.twitter.com/Wpqcee9WxG































