నా తమ్ముడు పెద్ద రాక్షసుడు..!! వాడి వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను… !

0
464

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… ఒక వైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్ అంటూ టాలీవుడ్ లో యమా బిజీగా ఉంటుందో ఈ అమ్మడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ లేక ఇళ్లకే పరిమితమయ్యారు మన స్టార్స్ అందరు.. ఈ అనుకోని హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అదే క్రమంలో రకుల్ కూడా తన తమ్ముడితో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖలు చేసింది రకుల్ ప్రీత్.

తానూ ఇప్పటి వరకు సింగిల్ గానే ఉన్నానని.. ఎవరిని ప్రేమించలేదని.. దీనంతటికి కారణం తన తమ్ముడు అమన్ కారణం అంటూ చెప్పుకొంచింది. నా తమ్ముడు ఎప్పుడు నా వెంటే నీడలా ఉంటాడు… వీడివల్ల నేను ఎవరితోనూ డేటింగ్ చేయలేకపోయాను. స్కూల్ లో చదువుతున్నపుడు నేను అబ్బాయిల పక్కన నిలబడితే… వెంటనే ఇంటికి వెళ్లి మా పేరెంట్స్ కి చెప్పేసేవాడు. ఒకసారి ప్లేట్ లో ఏవో పెట్టుకుని ఊరికే ఒక అబ్బాయి పక్కన నుంచున్నాను.. అంతే.. ఇంటికి వెళ్లి వెళ్ళగానే మా పేరెంట్స్ తో.. ఆ అబ్బాయికి ఎదో తినిపిస్తున్నానని చెప్పేసాడని చెప్పింది. నన్ను స్వేచ్ఛగా తిరగనివ్వలేదు ఈ రాక్షసుడు అంటూ సరదాగా నవ్వుతూ కామెంట్స్ చేసింది.

పక్కనే ఉన్న రకుల్ తమ్ముడు అమన్ కూడా మాట్లాడుతూ.. నా వల్లే తాను ఇలా ఉండిపోయిందని.. అక్క స్కూల్ టైంలో ఇంట్లో చాడీలు చెప్పేవాడినని ఆ రకంగా అక్కను ముప్పుతిప్పలు పెట్టాను. అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు… అంటూ కామెంట్స్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here