టర్కీ అడవుల్లో రష్యా విమానం యాంఫిబియస్ బెరివ్ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సు అడువుల్లో మంటలు అర్పేందుకు వెళ్ళిన సంకేతికలోపం కారణంగా ప్రమాదానికి గురైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సాకేంతిక లోపంతో విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని.. దీంతో విమానం కూలినట్లు స్థానిక గవర్నర్ ఒమర్ ఫరూక్ కోస్కున్ తెలిపారు.ప్రమాద తీవ్రతను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఘటనా స్థలానికి పంపింది.































