“నగ్నం” నిజంగా ఈ మూవీని చూసిన వాళ్ళెవరికైనా ఇది రామ్ గోపాల్ వర్మ సినిమాయేనా లేక బీగ్రేడ్ షార్ట్ ఫిల్మా.? అనే సందేహం కలగక మానదు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరోనా టైంలో కూడా ప్రేక్షకుల బలహీతలను ఎలా క్యాష్ చేసుకోవాలో ప్లాన్ చేసి విడుదల చేసిన చిత్రమే “నగ్నం” అని తెలిసిపోవడంతో ఆర్జీవి ఎంతగా దిగజారిపోయాడో చెప్పడానికి ఈ చిత్రం మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. దీన్ని సినిమా అనడం కన్నా షార్ట్ ఫిలిం అనడమే బెటర్. ఎందుకంటే కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో పబ్లిసిటీ చేసి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నంలో జనాలకు మరోసారి నరకం చూపించాడు ఆర్జీవి.

శ్రేయాస్ మీడియా, ఆర్జీవి సంయుక్తంగా ఓటీటీలో విడుదల చేసిన ఈ సినిమా ప్రారంభం నుండి శుభం కార్డ్ వరకూ మన జేబులో నుండి అనవసరంగా రెండొందలు ఖర్చు పెట్టామనే ఫీలింగే కలుగుతుంది. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలలో కేవలం ట్రైలర్ మాత్రమే బాగుంటుంది. ఆ ట్రైలర్ లో ఉన్నదే సినిమా అంతా ఉంటుంది కానీ ప్రత్యేకంగా కధేమీ వుండదనే రిమార్క్ ఉంది. గతంలో K.s.d అప్పలరాజు వంటి చాలా సినిమాలతో అది నిజమని నిరూపించుకున్న ఆర్జీవీ, ఈసారి నగ్నం చిత్రంతో మరోసారి ఆ రిమార్క్ ను తన సొంతం చేసుకున్నాడు.

ఒక ఇంట్లో జరిగిన ఓ అక్రమ సంబంధం కథతో సినిమాను మొత్తం చుట్టేశాడు వర్మ. ఇంత నీచాతినీచమైన పరమ చెత్త కథను, ఇంత చెత్త ప్రొడక్షన్ వాల్యూస్ ను ఇప్పటివరకు వర్మ సినిమాల్లో మనం చూసి ఉండం. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి కథల్ని 90ల్లోనే షకీలా చేసేసింది. మల్లు మూవీస్ లో కూడా ప్రేక్షకులు చూసేశారు. నగ్నం సినిమాలో హీరోయిన్ ఎక్స్ పోజింగ్, కెమెరామెన్ ఫ్రేమ్స్ తప్పితే ఇంకేం కనిపించవు. కనీసం హీరోయిన్ కు నటించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎంతసేపూ ఆమె అందాల్ని చూపించడం, కవ్వించేలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వరకే స్వీటీని పరిమితం చేసేశాడు వర్మ. ఇక కెమెరా యాంగిల్స్ అయితే నరకమంటే ఎలా వుంటాయో అనుభవంలోకి తెస్తాయి.

హీరోయిన్ కు ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టకూడదో ఆలోచించి మరీ అక్కడే ఫ్రేమ్స్ పెట్టి రీలన్నీ చుట్టేశాడు ఆర్జీవి. ఆఖరుకి కెమెరాలు కూడా తొంగి చూడలేని శరీర భాగాలను మొబైల్ తో చిత్రీకరించాడంటే నిజంగా వర్మ మెంటాలిటీని అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ పైశాచికత్వానికి, పీక్స్ లో అంగాంగ ప్రదర్శనకు మాత్రమే ఈ 22 నిమిషాల సినిమాను తీశారేమో అనిపిస్తుంది. 200 రూపాయలు టికెట్ పెట్టి ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాను డబ్బులు పెట్టి కొని చూసిన ప్రేక్షకులు తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. అదండి సంగతి.. చదివారుగా రామ్ గోపాల్ వర్మ పైశాచిక చిత్రం “నగ్నం” రివ్యూను.. మరి మీ జేబుకూ కూడా చిల్లు పడకుండా వుండాలంటే ట్రైలర్ చూసి మోసపోకండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here