టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కున్న క్రేజ్ గురించి, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఇలా సినిమాలతో రికార్డ్స్ ను క్రియేట్ చేసే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేం రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిన్నాడు. అంతే కాకుండా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చెయ్యడానికి సిద్ధమౌవుతున్నాడు. ఈ 2 కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం.  ప్రస్తుతానికి కరోనా లాక్ డౌన్ వలన నిలిపివేసిన షూటింగ్స్ ను మళ్ళీ మొదలుపెడుతున్న నేపథ్యంలో “రాధే శ్యామ్” చిత్రం షూటింగ్ త్వరలోనే రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మొదలవ్వబోతోంది. ప్రభాస్ మరియు పూజా హెగ్దేలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటింబోతున్న భాగ్యశ్రీ – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ కూడా ఉండబోతున్నాయని చిత్రబృందం తెలిపింది. తాజాగా ఈ చిత్ర విశేషాలపై అలనాటి బాలీవుడ్ బ్యూటీ, కధానాయిక భాగ్యశ్రీ మీడియాతో ముచ్చటించింది. “ప్రభాస్ సినిమాలో మీరు నటిస్తున్నారా.?” అనడిగిన ప్రశ్నకి ‘నిజమే .. నేను ప్రభాస్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. ఒక ఆర్టిస్ట్ గా నాకు సంతృప్తిని ఇచ్చే పాత్ర ఇది. ఇంత వరకూ నేను చేసిన పాత్రల్లో ఇది గొప్ప పాత్ర అవుతుంది. చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ప్రభాస్ ని సెట్ లో అందరూ డార్లింగ్ డార్లింగ్ అంటుంటే నాకు కూడా డార్లింగ్ అయిపోయాడు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత నేను ప్రభాస్ ఫ్యాన్ గా మారిపోయాను. ఒక సూపర్ స్టార్ కు ఉండే గర్వం, అహంకారం వంటి లక్షణాలలేవీ నేను ప్రభాస్ లో చూడలేదు. అందరితో సరదాగా కలిసి పోతుంటాడు. అందరికీ మర్యాద ఇచ్చే అతని పద్ధతిని కూడా చూసి నేను ఆశ్చర్యపోయాను. అందరితో చాలా క్లోజ్ గా మాట్లాడతాడు… అతనొక టీమ్ ప్లేయర్’ అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ.. తెలుగు ప్రేక్షకులు ఇంకా నన్నింతగా గుర్తు పెట్టుకుని మరీ పలకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది” అంటూ సరదాగా నవ్వుతూ ఇంటర్వ్యూను ముగించింది భాగ్యశ్రీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here