Bharath Gourav Tourist Express : దక్షిణ మధ్య రైల్వే కొత్తగా భారత్ గౌరవ్ ఎక్ష్ప్రెస్స్ పేరిట ఒక కొత్త రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చారు. మార్చి 18న ప్రారంభమయిన ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయల్దేరి, 8 రోజుల పాటు పూరీ, కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా ప్రయాణిస్తుంది. మళ్ళీ తిరిగి 26వ తేదీ ఉదయం 6.00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఏప్రిల్ 18న బయల్దేరే రెండో రైలు మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి, యథావిధిగా దర్శనీయ ప్రాంతాలను చుట్టేసి ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 11.00 గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు లోని మరిన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.

9 రోజుల ప్రయాణం… పుణ్యక్షేత్రాల దర్శనం…
భారత్ గౌరవ్ ఎక్ష్ప్రెస్స్ లో మొత్తం 700 సీట్లు ఉన్నాయి. 460 స్లీపర్ బెర్త్ లు, 192 థర్డ్ ఏసీ బెర్త్ లు, 48 సెకండ్ ఏసీ బెర్త్ లు ఉన్నాయి. ఈ యాత్రలో చూసే ప్రాంతలైతే పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసి-కాశీ విశ్వనాథ్ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరం తదితర దర్శనాలను భక్తులకు కల్పిస్తారు. యాత్ర 8 రాత్రులు, 9 రోజుల వరకు కొనసాగుతుంది.

700 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా ధరను నిర్ణయించారు. స్లీపర్ తరగతి (ఎకానమీ)లో టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.15,300(స్లీపర్), రూ.24,085 (థర్డ్ ఏసీ), రూ.31,500 (సెకండ్ ఏసీ) ఛార్జీలుగా నిర్ణయించారు. డబుల్/ట్రిపుల్ షేర్ రూ.13,955(స్లీపర్); రూ.22,510(థర్డ్ ఏసీ), రూ.29,615(సెకండ్ ఏసీ)గా నిర్ణయించారు. అదే 5-11 సంవత్సరాల మధ్య పిల్లలకైతే ఈ ధరలు వరుసగా రూ.13,060, రూ.21,460, రూ.28,360 చొప్పున ఉన్నాయి. సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు ద్వారా హిందూ పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌లో ప్రారంభమైన రైలు పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ఆగుతుంది.



























