Bhavana :మలయాళ ముద్దుగుమ్మ భావన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2008 లో వచ్చిన గోపిచంద్ ‘ఒంటరి’ సినిమాతో పరిచయమైనా శ్రీకాంత్ నటించిన ‘మహాత్మ’ సినిమాతో కనువిందు చేసింది ఈ కేరళ కుట్టి. తెలుగులో ఎక్కువ సినిమసలు చేయకపోయినా మలయాళం, తమిళం, కన్నడ లో అగ్ర హీరోల సరసన నటించింది. ఇక మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతా బాగుంది కెరీర్ బాగా దూసుకుపోతున్న సమయంలో భావన మీద లైంగిక దాడి జరిగింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

నన్ను చీకటిలోకి నెట్టాలని ఇంకా ప్రయత్నిస్తున్నారు…
భావన మీద పగతో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ భావన మీద కారులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది దుండగులతో కిడ్నాప్ చేయించి, లైంగిక దాడి చేయించారు. 2017 ఫిబ్రవరి లో ఇది జరిగాక భావన ఈ సంఘటన నుండి కోలుకోడానికి ఏడాది సమయం పట్టింది. ఆ తరువాత కూడా ఇంటి నుండి బయటికి రావాలంటే భయపడేది, కేవలం అవసరం ఉంటే తప్ప బయటికి వచ్చేది కాదు. అలా ఉన్న భావన ఇపుడిప్పుడే కొంచెం బయటి ప్రపంచానికి అలవాటు పడుతున్న తరుణం లో ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ కి కామెంట్స్ కొంతమంది చాలా నెగెటివ్ గా చేసారు.
ఆమె డ్రెస్ మీద అసభ్యంగా మాట్లాడారు. ఇక కొంతమంది మంది అలా డ్రెస్ గురించి కామెంట్స్ చేస్తే మన మీద కూడా లైంగిక దాడి కేసులు పెడుతుంది జాగ్రత్త అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి భావన స్పందిస్తూ ఎమోషనల్ అయింది. ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను విడుదల చేసింది. అంతా బాగుంటుంది, అని ప్రతి రోజూ నాకు నేను చెప్పుకుంటూ బతుకుతున్నాను. నా కుటుంబాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక నాలోని బాధను దూరంగా ఉంచటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను. నేను ఏం చేశానో అది అవసరం లేనిది. నన్ను బూతు మాటలతో వేధించారు. నాకు తెలుసు, చాలా మంది నన్ను మళ్లీ చీకటి కూపం లోకి పంపాలని చూస్తున్నారు. వాళ్లకు అందులోనే ఆనందం ఉందని నాకు అర్థం అయింది. మీరు కూడా అలానే సంతోషాన్ని పొందుతున్నారు. నేను వారిని ఆక్షేపించాలనుకోవటం లేదు, అంటూ మలయాళంలో పోస్ట్ పెట్టింది భావన.



























