Bhuma Mounika Reddy : గత రెండు రోజులుగా బాగా వైరల్ అవుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి. వీళ్లిద్దరూ మర్చి 3న ఘనంగా రెండో పెళ్లి చేసుకున్నారు. అసలు వీరికి ఎలా పరిచయం అనే ఆరాలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో. గత వినాయక చవితికి మనోజ్ స్నేహితుడు రవి అనే వ్యక్తి సీతఫల్ మండిలో వినాయకుణ్ణి పెట్టడం, అక్కడికి మనోజ్ ను ఆహ్వానించడంతో మనోజ్, మౌనిక ఇద్దరూ అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకోడానికి రావడంతో అందరి దృష్టి ఈ జంట మీద పడింది. ఇక మనోజ్ కూడా తొందర్లో గుడ్ న్యూస్ చెబుతా అనడంతోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం అర్థమైంది. ఇక మర్చి మూడున వీళ్లిద్దరూ ఒక్కటవ్వగా పెళ్లి మోహన్ బాబు కి ఇష్టం లేదనే వార్తలు బాగా వచ్చాయి.

పెళ్లిలో ఎమోషనల్ అయిన మౌనిక…
మంచు మనోజ్ భూమా మౌనిక ను రెండో పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదనే వార్తలు మొదటి నుండి వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే మంచు లక్ష్మి తన ఇంట్లో మనోజ్ కి పెళ్లి చేసిందనే వార్తలు వినిపించాయి. అయితే పెళ్ళికి మోహన్ బాబు హాజరై అలాంటి వార్తలకు చెక్ పెట్టారు.

మోహన్ బాబు ఆశీర్వాదం ఇవ్వడానికి రాగానే భూమా మౌనిక ఆయనను పట్టుకుని ఏడ్చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మౌనిక అంత ఎమోషనల్ అవడం మోహన్ బాబు హగ్ చేసుకుని ఓదార్చడంతో మోహన్ బాబుకి ఈ పెళ్లి ఇష్టం లేదనే వార్తలకు చెక్ పెట్టినట్లయింది.



























