Bhuma Mounika Reddy : మార్చ్ మూడవ తేదీన మంచు మనోజ్ కుమార్ తన రెండవ వివాహం భూమా మౌనిక రెడ్డిని చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కాగా రాయలసీమలో భూమా నాగిరెడ్డి కుటుంబం రాజకీయంగా ప్రాముఖ్యత ఉండగా వీరి పెళ్లి ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ అయింది. మంచు మనోజ్ మొదటి పెళ్లి తన వదిన స్నేహితురాలు ప్రణీత రెడ్డిని చేసుకున్నా వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఇక మౌనిక రెడ్డి వివాహం ఒక వ్యాపారవేత్తతో జరిగినా తాను కూడా భర్తతో విడిపోయింది. ఇక అసలు మౌనిక రెడ్డికి మంచు మనోజ్ కి ఎలా పరిచయం అన్నది చర్చనీయాంశం అయింది.

చదువుకునేటప్పుడే పరిచయం… ప్రేమ…
మౌనిక రెడ్డికి తండ్రి మీద ప్రేమ ఎక్కువ, నాగిరెడ్డి గారి ముద్దుల కూతురుగా పెరిగినా పిల్లలు మీద రాయలసీమ ఫ్యాక్షన్ నీడ పడకుండా దూరంగా పిల్లలను పెట్టి చదివించారు నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు. అలా మౌనిక రెడ్డి ఊటీ లో స్కూల్ లో చదవగా బ్రాడ్ క్యాస్టింగ్ జర్నలిజం న్యూయర్క్ లో చేయగా అక్కడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్న మనోజ్ తో పరిచయం ఏర్పడింది.

పరిచయం ప్రేమగా మార్చుకునేలోపే మౌనిక రెడ్డి కి నాగిరెడ్డిగారు వివాహం చేసేసారు. 2016 లో గణేష్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న మౌనిక రెడ్డి 2018లో ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఇక విబేధాల కారణంగా గణేష్ తో విడిపోయిన మౌనిక రెడ్డి గతేడాది వినాయక చవితి రోజున మనోజ్ తో కలిసి సీతాఫల్ మండి దగ్గర వినాయక మండపంకి రావడంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపించాయి. ఇక నేడు వాళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. మొదట పెళ్ళికి మోహన్ బాబు కుటుంబం ఒప్పుకోలేదని వార్తలు వినిపించాయి కానీ ఇరు కుటుంబాలు ఒప్పుకుని వైభవంగా పెళ్లి జరిపించాయి. మంచు లక్ష్మి అన్నీ తానై తమ్ముడి పెళ్లి జరిపించింది.

































