Big boss : బిగ్ బాస్ రియాలిటీ షో, ఈ రియాలిటీ గేమ్ అన్ని భాషలలోనూ బాగా హిట్ అయింది. పక్కన వారి జీవితంలో జరిగే విషయాలపై అందరికి ఆసక్తి ఎక్కువ. ఇక అలాంటిది కొంతమంది సెలబ్రిటీలను ఒక దగ్గర ఉంచి కెమెరాలు పెట్టి 24 గంటలు వాళ్ళు ఏమి చేస్తున్నారో చూపిస్తామంటే జనాలు మాత్రం వద్దంటారా.. అందుకే ఈ షో హాలీవుడ్ లో మొదలై ఇపుడు మన ఇండియాలోని చాలా భాషలలో హిట్ షో గా నిలుస్తోంది. ఇక ఈ షో పై వివాదాలు కుడా అలాగే వస్తాయి. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు యువత పై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని విమర్శిస్తుంటారు. అయినా జనాలు మాత్రం షో చూడటం మనలేదు.

బిగ్ బాస్ సీజన్ 6 నానస్టాప్ విన్నర్….

ఇక తెలుగులో బిగ్ బాస్ ఇపుడు సీజన్ 6 రన్ అవుతోంది. ఇక తుది దశకు చేరుకున్న ఈ షోలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ఇపుడు పెరిగింది. టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఉన్న అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, మిత్ర శర్మ, అరియనా లలో ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారో అన్న చర్చ మొదలైంది. ఇక గత సీజన్ ల నుండే మొదలైన లీకుల బెడద వల్ల బిగ్ బాస్ థ్రిల్ మిస్ అవుతున్నారు జనాలు. ఇక ఫైనల్ ఎపిసోడ్ షూట్ అయిపోవడం వల్ల విన్నర్ ఎవరో లీకులు మొదలయ్యాయి. ఇక ఈ సీజన్ లో బిందు మాధవి అఖిల్ సార్థక్ ల మధ్య మొదటి నుండి హోరా హోరి అన్నట్టుగా ఉంది. ఇక వీళ్లిద్దరు టాప్ 2 కంటెస్టెంట్స్. ఇక వీరిలో బిందు మాధవి గెలిచి అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచినట్టు లీకులు వస్తున్నాయి.
Thanks to each and everyone of you for rooting for our BINDU in this wonderful journey! We will always be indebted to you all ❤️
— Bindu Madhavi (@thebindumadhavi) May 18, 2022
– Team Bindu#BiggBossNonStopTelugu #BinduTheSensation
కండ బలమే కాదు వ్యక్తిత్వంతోను బిగ్ బాస్ గెలవచ్చు అని అభిజిత్ నిరూపించాడు. ఇక ఇపుడు కూడా బిందు మాధవి అలానే గెలిచినట్టు చెబుతున్నారు. #Bindhu the sensation, # Bindhu Madhavi అన్న ట్యాగ్ లతో ట్రెండింగ్ చేస్తున్నారు బిందు అభిమానులు. ఇక లీకుల సమాచారం ప్రకారం బిందు విన్నర్, అఖిల్ రన్నర్ అప్, ఇక మిత్ర శర్మ మూడో స్థానంలో, యాంకర్ శివ నాలుగో స్థానంలో, ఐదవ స్థానంలో అరియనా ఉన్నారు. ఇక ఈ లేకుల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఫినాలే వరకు ఆగాల్సిందే.



























