Big boss 6 contestant Marina : బిగ్ బాస్ షో గురించి మంచిగా చెప్పే వాళ్ళ కంటే తిట్టే వాళ్ళే ఎక్కువ. అయినా షో కి రేటింగ్స్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈసారి రేటింగ్స్ లో వెనుకబడింది అది వేరే విషయం. షోలో బూతులు తిట్టుకోవడం, డబల్ మీనింగ్ డైలాగులు ఒక ఎత్తు అయితే ఈ సారి హౌస్ లోకి సీజన్ 3 లో లాగా రియల్ కపుల్ ని పంపారు. దీంతో ఆ కపుల్ రొమాన్స్ చాలదన్నట్లు ఇక కొత్తగా కపుల్స్ అయ్యేవాళ్ళ రొమాన్సలతో బిగ్ బాస్ కంపు అయింది. ఈ షోని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడలేక పోతున్నామని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కూడా. ఇక సిపిఐ నారాయణ వంటి వారైతే పరుషంగా షో గురించి విమర్శిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా షో చూసేవాళ్ళు లేక పోలేదు. అలా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 తుది దశకు వచ్చేసింది. ఆటలో ఉత్కంఠ పెరిగింది. ఒక్కో స్ట్రాంగ్ కంటెస్టెంట్ మెల్లగా బయటికి వస్తున్నారు. ఇక తాజాగా రియల్ కపుల్ మరీనా రోహిత్ జంటలో మరీనా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

హౌస్ లో రొమాన్స్ చేస్తే తప్పేంటి…
మరీనా రోహిత్ లు భార్యాభర్తలుగా షోకి వెళ్లినా ఎవరి ఆట వారిదే. కాకపోతే ఇద్దరూ కలిసే మొదటి నుండి గేమ్ ఆడారు. ఇక ఎలిమినేట్ అయ్యాక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మరీనా ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా అక్కడే పరిచయమై స్నేహితులు అవుతున్నవారే కలిసి ఆడుతున్నపుడు నేను నా భర్త కలిసి ఆడటం తప్పు కాదు కదా అంటూ సమర్థించుకుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ గురించి ప్రశ్న ఎదురు కాగా హౌస్ లో నేను నా భర్త రొమాన్స్ చేస్తే తప్పేంటి అంటూ సమాధానము ఇచ్చింది. ఇక హౌస్ లోకి వెళ్లడమే గొప్ప సక్సెస్. ఎంతో మంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి షోలో వెళ్లి టాప్ టెన్ వరకు ఉండటం నాకు సక్సెస్ లానే ఉంది అంటూ చెప్పింది. ఇక ఎవరు విన్ అవుతారు అనే విషయానికి వస్తే ఆ విషయం నాకు తెలియదు ఎవరు ఎక్కడిదాకా నిలబడతారో అంటూ సేఫ్ ఆన్సర్ చెప్పేసింది.



























