Big boss contestant Adireddy: ఒక కామన్ మాన్ గా ఒక యూట్యూబర్ గా ఎదిగిన వ్యక్తి ఆదిరెడ్డి. ఆర్థిక ఇబ్బందులు, చేతిలో పని లేకపోవడం, కుటుంబ బాధ్యతలు ఆదిరెడ్డి ని యూట్యూబర్ ను చేసాయి. మొదట్లో ఐపీల్ మ్యాచ్లు మొదలుగు రివ్యూలతో మొదలుపెట్టి తరువాత బిగ్ బాస్ రివ్యూలతో జనాలను ఆకట్టుకున్నాడు. ఫాలోయర్స్ ను తన కష్టంతో పెంచుకుంటూ పోయి బిగ్ బాస్ రివ్యూలను ఇచ్చే స్టేజి నుండి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లే స్టేజి కి ఎదిగాడు. ఇక తన బిగ్ బాస్ జర్నీ విన్నర్ కాలేకపోయినా టాప్ 3 గా నిలిచి సక్సెస్ అయిన ఆదిరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి పలు ఇంటర్వ్యూల్లో ముచ్చటించారు.

మా అమ్మను ఇప్పటికీ తిడతారు…
ఆదిరెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు విన్నర్ కాలేకపోయినా టాప్ 3 కి చేరుకున్నందుకు ఇంత దూరం తనను తీసుకోచ్చిన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు. డబ్బు మాత్రమే కాకుండా తన కుటుంబం మొత్తం బిగ్ బాస్ స్టేజి మీద నిలబడినపుడు చాలా గర్వంగా అనిపించిందని, కళ్ళు లేకపోయినా నా చెల్లి కవిత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదిస్తోంది అంటూ తన కాళ్ళమీద తాను నిలబడుతోంది ఇవన్నీ గర్వంగా అనిపిస్తాయి. కానీ ఈరోజు మా అమ్మ ఉంటే పిల్లల సక్సెస్ చూసి చాలా సంతోషించేది అంటూ ఎమోషనల్ అయ్యారు. తాను ఆత్మహత్య చేసుకుని చనిపోకుండా ఉండుంటే ఈరోజు పిల్లల విజయం చూసి సంతోషపడేది. అందరికీ నేను చెప్పేది అదే బాధలు అందరికీ వస్తాయి, సమస్యలు అందరికీ వస్తాయి, టైం కి వాటిని వదిలేయాలి.

సమస్యలు జీవితం మొత్తం ఉండవు టైంకి వదిలేస్తే అవే వెళ్ళిపోతాయి, ఆ ఒక్క క్షణం బలంగా ఉండగలిగితే మీ కుటుంబానికి మేలు చేసినవారవుతారు. మా అమ్మ క్షణికావేశంలో చేసిన పనికి ఇప్పటికీ మా ఊర్లో పెద్ద వాళ్ళు తనని తిడతారు. అప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు సంతోషంగా ఉండేది కదా అని బాధపడతారు అంటూ చెప్పారు. ఇక తన భార్య కవిత లేకపోతే తాను ఇంత సక్సెస్ చూసేవాడిని కాదు అంటూ ఆదిరెడ్డి తెలిపారు. తాను గర్భవతి అయినా కూడా యూట్యూబ్ వీడియోస్ కోసం కస్టపడేది, అలానే ఇక ఇప్పుడు చిన్నపాప, చూపులేని నా చెల్లిని, అలాగే వయసుమల్లిన నా తండ్రిని చూసుకుంటూ కూడా యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తూ నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తూ నా విజయంకు కారణమైంది అంటూ తెలియపారు. జీవితంలో తనకు ఏ కష్టం రానివ్వను అలానే చిన్న మాటైనా తిట్టను అంటూ తెలిపారు ఆదిరెడ్డి.



























