Big boss contestent Adireddy : బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ముగిసింది. అందరూ భావించినట్లే విన్నర్ గా సింగర్ రేవంత్ నిలవగా శ్రీహాన్ సెకండ్ ప్లేసులో నిలిచాడు. అయితే శ్రీహాన్ కు రేవంత్ కి ఓటింగ్ లో పెద్దగా వత్యాసం రాలేదంటూ వినిపిస్తోంది. ఇక ఆదిరెడ్డి, కీర్తి భట్ టాప్ 3 మరియు 4 లో నిలవగా ఈసారి బిగ్ బాస్ లో మాత్రం అనూహ్య పరిణామాలు జరిగాయని చెప్పొచ్చు. శ్రీహాన్ నిజానికి విన్నర్ అయితే అతను 40 లక్షలకు టెంప్ట్ అయి మిడిల్ డ్రాప్ అవ్వడం తో రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. అయితే చివర్లో శ్రీహాన్ కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని నాగార్జున గారు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక టాప్ 5 లో నిలిచిన కామన్ మాన్ యూట్యూబర్ ఆదిరెడ్డి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిగ్ బాస్ కు సంబందించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాగార్జున క్లూ ఇచ్చారు… శ్రీహాన్ కు ఆ ప్రాబ్లెమ్ ఉంది…
బిగ్ బాస్ ఫినాలే గురించి మాట్లాడుతూ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారు అంటూ నాగార్జున గారు ఇంకా ఫైనల్ కి ముందే చెప్పారు. అది వాళ్లిద్దరిలోనే విన్నర్ అని చెప్పినట్లే భావించవచ్చా అని ఇంటర్వ్యూలో అడిగినపుడు ఆదిరెడ్డి అలాంటిదేమి లేదు. నాగార్జున గారు సరదాగా అన్నారు రేవంత్ ఫుల్ బ్లాక్ వేసాడు, శ్రీహాన్ లైట్ బ్లాక్ వేసాడు, అయినా అది కూడా స్టేజి మీద బాగుటుందని వేసుండవచ్చు, క్లూ ఏం కాదు అంటూ తోసిపూచ్చాడు.

ఇక ఆదిరెడ్డి మాట్లాడుతూ మిడిల్ డ్రాప్ అవ్వడానికి నాకు కోటి రూపాయల ఆశ చూపినా తీసుకునేవాడిని కాదంటూ చెప్పాడు. అది విన్నర్ ప్రైజ్ మనీ జనాలు ఓట్లేసి గెలిపించిన వాడికి అది చెందాలి కాబట్టి నేను తీసుకునేవాడిని కాదు అంటూ తెలిపారు. అయితే శ్రీహాన్ గురూంచి ముందు నుండి తెలుసు. తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే తాను 40 లక్షలు తీసుకున్నాడు అంటూ ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రేవంత్ గెలుస్తాడని ముందు నుండి అనుకున్నాను. అయితే శ్రీహాన్, గట్టి పోటీ ఇచ్చాడు అంటూ తెలిపారు ఆదిరెడ్డి.



























