Big boss contestants funny cricket match : బిగ్ బాస్ సీజన్ 5 లో మనల్ని బాగా ఎంటర్ టైన్ చేసిన కంటెస్టెంట్స్ అంటే టక్కున సన్నీ, శ్రీ రామ చంద్ర, రవి, జెస్సి గుర్తొస్తారు. సీజన్ 5 లో వీరు గొడవలు పడినా, గేమ్స్ లో వాదించుకున్న చివరికి మాత్రం అన్ని మర్చిపోయి వాళ్ళు నవ్వుతూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ గా మిగిలిన సన్నీ, మానస్, షన్ను, సిరి, శ్రీరామచంద్ర ఉన్నపుడు కూడా షన్ను, సిరిలను పక్కన పెడితే వీళ్లు ముగ్గురు క్రికెట్ ఆడి మనలను బాగా నవ్వించారు.

ఇక ఇపుడు బయటికి వచ్చాక వారి జీవితాల్లో కెరీర్ పరంగా బిజీ గా ఉన్నా వీళ్ళు మళ్ళీ ఇపుడు సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడి నవ్వించారు. ఇక ఈ మ్యాచ్ క్రికెటర్ హనుమ విహారి సమక్షంలో జరిగింది. ఇక కామెంటరీ ఇస్తూ జెస్సి బాగా నవ్వించాడు. రవి, శ్రీ రామ్, జెస్సి, సన్నీ ఆడిన ఈ మ్యాచ్ ను వ్లాగ్ గా జెస్సి షూట్ చేసారు. ఇక జెస్సి బిగ్ బాస్ తర్వాత యూ ట్యూబ్ ఛానల్ పెట్టడం తెలిసిందే ఇక ఆట ప్రారంభానికి ముందు రవి మాట్లాడుతూ… సన్నీ ఫస్ట్ ప్లేయర్ గా వెళ్తాడు సో నెక్స్ట్ ప్లేయర్ రెడీ గా ఉండండి, ఒక బాల్ కి సన్నీ తిరిగి వచ్చేస్తాడని అంటూ జోకులు వేశారు. ఇక ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.































