Big boss contestent Srihan : బిగ్ బాస్ సీజన్ 6 ఎలిమినేషన్లు, గొడవలు, టాస్క్లు, అంటూ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పుడు కాంటెస్టెంట్ల ఫ్యామిలీ టైం అంటూ ఒక్కొక్కరిగా ఒక్కో ఇంటి సభ్యుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడంతో బిగ్ బాస్ ఎమోషనల్ హౌస్ అయిపోయింది. అయితే అందరిలోనూ ఇనయా మదర్ వచ్చినపుడు బాగా ఎమోషనల్ అయ్యారు. కుటుంబానికి దూరంగా ఉంటున్న ఇనయాకు తన తల్లి మళ్ళీ కలవడం బిగ్ బాస్ లో హైలెట్. ఇక కీర్తి కోసం మనసిచ్చి చూడు హీరో రావడం బాగుంది. అయితే మొత్తం ఈ ఎపిసోడ్స్ లో ఒక బుడ్డోడు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు శ్రీహన్ కొడుకు చైతూ. అసలీ చైతూ ఎవరు అనే ఆరా తీస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్..

సిరి, శ్రీహన్ ల కొడుకు చైతూ…
బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న సిరి ఈ సారి తన బాయ్ ఫ్రిండ్ శ్రీహన్ కోసం హౌస్ లోకి అడుగుపెట్టింది. అయితే మొదట వాళ్ళ బాబు చైతూ హౌస్ లోకి వచ్చాడు. హౌస్ లో ఉండే అందరితో బాగా అల్లరి చేసిన చైతూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. అయితే అసలు ఈ బాబు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

సిరి పెంచుకుంటున్న చైతూ సిరి వాళ్ళ మేనమామ కొడుకు అనే విషయం లాస్ట్ సీజన్ అపుడు సిరి తల్లి స్వయంగా చెప్పారు. తనని సిరి దత్తత తీసుకుని పెంచుకుంటోందట. సిరి శ్రీహన్ ఆ బాబు ను ఎంతో ప్రేమతో పెంచుకుంటన్నారు. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన సిరి తన మెడ మీద శ్రీహన్ పేరును టాటూ వేయించుకుని శ్రీహన్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ వ్యూవర్స్ కి బాగా నచ్చింది.



























