Big Boss Geethu husband Vikas : బిగ్ బాస్ సీజన్ 6 తుది దశకు చేరుకుంది. టాప్ 5 లో ఉంటుంది అనుకున్న గలాటా గీతూ ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ మొదటి నాలుగు వారాలు బిగ్ బాస్ మొత్తం గీతూ చుట్టే తిరిగింది. ఓ వైపు గొడవలు మరో వైపు కామెడీ అంటూ ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసిన గీతూ ఎలిమినేషన్ అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక గీతూ నిజ జీవితంలో ఎలా ఉంటుంది తన అల్లరి తాను పడిన కష్టాలు అన్నింటి గురించి గీతూ భర్త వికాస్ మాట్లాడారు.

తను ఏడ్చేసరికి నాకు ఏడుపు వచ్చింది…
గీతూ చాలా చలాకిగా, తన చిత్తూరు యాసతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో టిక్ టాక్ ఇంస్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ అయిన గీతూ ఆ తరువాత జబర్దస్త్ శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షోలలో అలరించింది. ఇక బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాము అంటూ గీతూ భర్త వికాస్ మాట్లాడారు. వికాస్, గీతూది ప్రేమ వివాహం అయితే పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. గీతూ ఇష్టమైన ఫీల్డ్ లోకి వెళ్తానంటే వికాస్ ప్రోత్సాహించారు.

అలాగే తన కోసం ఉద్యోగం కూడా మార్చుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. చాలా నాటీ గా కూల్ గా ఉండే గీతూ బిగ్ బాస్ మొదటి రోజే ఏడ్చేయడంతో నాకు ఏడుపు వచ్చింది అంటూ వికాస్ తన భార్య గీతూ గురించి చెప్పారు. ఎప్పుడూ మాట్లాడుతూ అందరినీ నవ్వించే గీతూ అలా ఏడ్చే సరికి ఏంటి ఈ పిల్ల ఇలా ఏడ్చేసింది అనిపించింది, బాగా ఏడుపొచ్చింది అంటూ వికాస్ చెప్పారు. వికాస్ గీతూ చిన్నప్పటి నుండి స్నేహితులు అయితే మధ్యలో కుటుంబ పరిస్థితులా రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పెరిగినా మళ్ళీ కలిసి స్నేహితులు అయ్యారు చివరికి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

































