Big boss season 6 : తెలుగు బిగ్ బాస్ మొదలైంది.. గొడవలు, కాంట్రవర్సీలు, బూతులు తిట్టుకోవడం, ఫన్ అలాగే ఎమోషన్స్ అన్నీ బాగా పండిస్తూ జనాలను ఎంటర్ టైన్ చేస్తోంది బిగ్ బాస్ షో. ఇక గత ఎపిసోడ్ లో కాంటెస్టనట్లు తమ జీవితాల్లొ జరిగిన విషాద ఘటనలను తలచుకుని వాళ్ళు బాధపడటమే కాకుండా ఇతర కంటెస్టెంట్లను ఏడపించేశారు. నాన్న అనే పిలుపుకు నోచుకోని రేవంత్ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ చెప్పి అందరినీ ఎమోషనల్ చేసాడు. తాను పుట్టక ముందే తండ్రిని కోల్పోయిన రేవంత్ కి నాన్న అని పిలుపించుకోవాలని చాలా ఎదురుచూస్తున్నానని చెప్పి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

రెండు సార్లు బిడ్డను కోల్పోయాను…
ఇక పింకీ లా అందరనీ అలరించిన సుదీప తాను తల్లిని అయ్యే అవకాశన్ని థైరాయిడ్ సమస్య వల్ల కోల్పోయానని, తన చెల్లి బిడ్డ రూపంలో తల్లిని అయినా తనని వదులుకోవాల్సి వచ్చినపుడు బాధపడ్డానని జీవితంలో ఏదో ఒక రోజు తల్లి అవుతానంటూ ఎమోషనల్ గా మాట్లాడి అందరినీ ఏడపించింది. ఇక మరో ఇంటి మెంబెర్ జారీ సత్య తన లవర్ బ్రేక్ అప్ వల్ల ఆత్మహత్యాయత్నం చేయడం, ఇంట్లోని సమస్యలను చెప్పి ఏడిపించింది. ఇక బిగ్ బాస్ లో వచ్చిన క్యూట్ కపుల్ మెరినా, రోహిత్ ఇద్దరూ తమ బిడ్డను కోల్పోవడం గురించ చెప్పి అందరినీ ఏడిపించారు. హార్ట్ బీట్ లేకపోవడం వల్ల రెండుసార్లు మూడో నెలలో గర్భాన్ని తీయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

ఇక అందరినీ నవ్వించే చలాకి చంటి కూడా తన కన్న తళ్ళి మంటల్లో కాలిపోయి చనిపోవడం గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఇక తన తల్లిని ఇద్దరు కవల పిల్లల రూపంలో దేవుడు ఇచ్చాడని చెప్పారు. ఇక కీర్తి భట్ తన జీవితంలో తన కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోవడం ఆ తరువాత ఒక పసిపాప ను దత్తత తీసుకొని పెంచుతుంటే ఆ బిడ్డను కోల్పోవడం గురించి చెప్పి ఎమోషనల్ అయింది. ఇక కీర్తి భట్ గతం విన్నాక అందరూ ఏడ్చేశారు. కడసారి ఆ బిడ్డను చూసుకోలేక పోయానని కీర్తి ఏడ్చడం తో అందరూ ఏడ్చేశారు. అలా బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ గా అయిపోయింది ఇక కెప్టెన్సీ కోసం ఓటింగ్, ప్రచారం అంటూ ఇంటి సభ్యులు బిజీ అయ్యారు.






























