Big Boss Season 6 : బుల్లితెర మీద బిగ్ బాస్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి రేటింగులను రాబడుతోంది. తెలుగులో ఇప్పటివరకు అయిదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా బిగ్ బోస్ 6 ప్రారంభం అయ్యింది. ఈసారి 21మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లడం జరిగింది.

వారి ప్రేమకథ ఎలా మొదలైందో చెప్పిన రణ్ బీర్-ఆలియా, నాగార్జున…
అభిమానులు ఎంతగానో ఏదురు చూసిన బిగ్ బాస్ 6 ఎట్టకేలకు నిన్న ప్రారంభం అయ్యింది. అయితే నిన్న జరిగిన వేడుకకి బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ బీర్, ఆలియా హాజరు అయ్యారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ జంట సందడి చేశారు. సినిమా చూడండి అని తెలుగులో చెప్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక వీరి లవ్ స్టోరీ గురించి చెప్తూ అందరినీ ఉత్సాహ పరిచారు. బ్రహ్మస్త్ర సినిమా ముందు వరకు వారు సింగల్ అని చెప్పుకున్న వీళ్ళు ఈ సినిమా టైం లో ప్రేమించుకోవడం, పెళ్లి అన్నీ జరిగిపోయాయి అని చెప్పుకొచ్చారు.

రణ్ బీర్, నాగార్జున అమల లవ్ స్టోరీ గురించి అడుగగా… నాగార్జున ‘శివ’ సినిమా సమయంలో ఒక అందమైన అమ్మాయిని చూశానని, తరువాత తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని వారి ప్రేమకథ ను చాలా సింపుల్ గా చెప్పారు. తరువాత బ్రహ్మస్త్ర కు, రణ్ బీర్ ఆలియా లకు అల్ ది బెస్ట్ చెప్పారు కింగ్ నాగార్జున.
































