రాహుల్ సిప్లిగంజ్… గత కొద్దిరోజులుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ గా నిలిచినా రాహుల్ సిప్లిగంజ్ పై అత్యంత దారుణంగా దాడి జరిగింది. గత రాత్రి తన గర్ల్ ఫ్రెండ్ తో పబ్ కి వెళ్లిన రాహుల్ సింప్లిగంజ్. ఆమెపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించగా.. పక్కనే ఉన్న రాహుల్ వారిని నిలదీశారు. దేనితో కోపోద్రిక్తులైన ఆ యువకులు బీరు బాటిల్ తో రాహుల్ సిప్లిగంజ్ తలపై కొట్టడంతో.. తీవ్ర రక్త స్రావంతో రాహుల్ గాయాలపాలయ్యారు.

దీనితో పబ్ నిర్వాహకులు హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ సింప్లిగంజ్ తలకు తీవ్రంగానే గాయాలైనట్టు సమాచారం. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సోదరుడు గాయపరిచిన వారిలో ఉన్నట్టు సమాచారం. దీనిపై పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పై దాడి జరగడంపై అయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ కృష్ణ వంశి “రంగమార్తాండ” చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్నారు. అయితే ఈ దాడి సమయంలో రాహుల్ తో పాటు ఎవరున్నారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.



























