Big boss Baladithya : బాలనటుడిగా 40 కి పైగా సినిమాల్లో నటించి ఆ తరువాత హీరోగా దాదాపు పది సినిమాలను చేసిన బాలాదిత్య ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన అన్న కౌశిక్ తో కలిసి సీరియల్స్, సినిమాల్లో నటించిన బాలాదిత్య తన నటనకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక హీరోగా చంటిగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడినా ఆ తరువాత పెద్దగా హిట్లు లేకపోవడం తో చదివు మీద దృష్టి పెట్టి సినిమాలకు దూరమయ్యడు. ఇక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలదిత్య ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తన నటనకు ఆస్కారమున్న కథలను చేస్తున్నారు. ఇక చిన్న వయసులోనే పెద్ద దర్శకులతో పనిచేసిన బాలాదిత్య అప్పటి అనుభవాలను పంచుకున్నారు.

ముండా అని చంప పగులగొట్టారు…
దర్శకుడు కే బాలాచందర్ గారికి కోపం ఎక్కువ అంటూ చాలా మంది ఆయనతో నటించిన వాళ్ళు చెబుతుంటారు. ఇక అలా బాలదిత్య బాలచందర్ గారి తమిళ సీరియల్ లో నటించాడు. అందులో తల్లి పాత్రలో ఉన్న గీత గారు ఫోన్ మాట్లాడుతూ పడిపోయే సన్నివేశంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ తల్లిని ఏమయిందని అడగాలి. అయితే షాట్ అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తే బాలచంధర్ గారు వచ్చి ‘ముండా… ముండా’ అంటూ తిట్టి చంప మీద కొట్టారట. ఎందుకు కొట్టారో కాసేపు అర్థం కాలేదట బాలదిత్య కు, అయితే బాలచందర్ గారు వెంటనే బాగా చేసావ్ కానీ చేసేదేదో నీ మార్కింగ్ లో నిలబడి చేయొచ్చు కదా నువ్వు నీ మార్కింగ్ లో నిలబడకపోవడం వల్ల లైటింగ్ సెట్ అవ్వక షాట్ సరిగా రాలేదు అని తిట్టారట.

ఆయనకు ఎవరినైనా ముండా అని అనడం ఊతపదమని అలా ఆరోజు తిట్టారు కాబట్టే జీవితంలో మరోసారి ఆ తప్పు చేయలేదని, నేను ఉండాల్సిన మార్కింగ్ లోనే యాక్టింగ్ చేసేవాడిని అంటూ చెంప దెబ్బకోట్టారని చెడు గా ఆలోచిస్తే నేర్చుకునేది ఏమీ ఉండదు, ఇలానే ఈవివి సత్యనారాయణ గారు కూడా షూటింగ్ లో చాలా కోపంగా ఉంటారు. ఆయనకు కోపం వస్తే బాగా తిడతారు ఒకసారి ‘ఏమండి ఆవిడ వచ్చింది’ సినిమా షూటింగ్ అపుడు రంభ విషయంలో జరిగింది. ఒక సీన్ లో ఉయ్యాల మీద కూర్చొని డైలాగు చెప్పాలి అయితే నాలుగు టేకులు అయినా ఇంకా సీన్ రావడం లేదు, రంభ గారికి అది సెకండ్ సినిమా ఒక్కసారిగా ఈవివి గారు అరిచి పక్కనే ఉన్న నన్ను పిలిచి చేసి చూపీ అన్నారు, నేను చేసాను. అలా చెయ్యి అనేసరికి రంభ భయపడ్డారు కానీ డైరెక్టర్ తిట్టారని బాధపడలేదు అంటూ అనుభవాలను పంచుకున్నారు.































