తీన్మార్ సావిత్రి అంటే అందరికి తెలుసు కాని శివజ్యోతి అంటే తెలిసింది మాత్రం బిగ్ బాస్ సీజన్ ౩ తరువాతే… నిజం చెప్పాలంటే అసలు శివజ్యోతి జీవితమే మారిపోయింది బిగ్ బాస్ సీజన్ -3 తరువాత. ఒక్కసారిగా తీన్మార్ సావిత్రి కాస్త శివజ్యోతిగా మారుపోయింది. ఆ తరువాత ఆమెకు ఆభిమానుల సంఖ్య పెరిగింది. ఆమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు V6 చానెల్ లో యాంకర్ కానీ ఇప్పుడు ఆమె యాంకర్ మాత్రమే కాదు ఒక సెలెబ్రిటీ కూడా. ప్రస్తుతం V6 నుంచి TV9 కి మకాం మార్చేసింది.

అయితే బిగ్ బాస్ పుణ్యమా అని బాగా పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి. అక్కడి నుంచి ఆమె లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అయితే బిగ్ బాస్ షో కంటే ముందు ఆమె జీవితంలో చాలా కష్టాలను అనుభవించింది. ప్రేమించిన గంగూలీని పెళ్లి చేసుకోవడం కోసం సొంత వారిని వదిలిపెట్టి వచ్చింది. ఇంట్లో పెద్దలను ఎదిరించి పెళ్ళి చెసుకుంది. ఆ తరువాత V6 లో యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి. అక్కడి నుండి అనుకోని అవకాశం బిగ్ బాస్ రూపంలో వచ్చింది. ఈ షో తరువాత ఆర్దికంగా స్ధిరపడిన అమె తన కలలన్నీ నెరవేర్చుకుంటుంది.

ఈ మద్యనే తాను కట్టించుకున్న ఇల్లు గృహప్రవేశం చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియోలు చూస్తేనే శివజ్యోతి ఇల్లు ఎంత పెద్దగా ఉందనేది అర్థమైపోయింది. తాజాగా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో శివజ్యోతి ఇంటి వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు శివజ్యోతి ఇంటితో పాటు సొంత కారు కూడా సంపాదించుకుంది. బిగ్ బాస్ పుణ్యమా అని లగ్జరీ ఇల్లు, కారు సొంతం చేసుకుంది. హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే తాజాగా శివజ్యోతి ఇల్లు చూసిన ప్రేక్షకులు లోపల ఉన్న ఇంటీరియర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు విశాలమైన గదులు, హాల్, అవన్నీ అందరినీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి. వాటితోపాటుగా ఖరీదైన వస్తవులు కూడా ఇంట్లో బాగానే పెట్టుంది జ్యోతక్క. బిగ్ బాస్ సీజన్ – 3 శివజ్యతి జీవితాన్ని మార్చేసింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీజన్ లోని మరికొందరు కంటిస్టెంట్స్ కూడా బాగానే సెటిల్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here