బిగ్ బాస్ షో సీజన్ 4 ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఈ షోలో ఎవరు పాల్గొనబోతున్నారనే ఉత్కంఠకి తెర తొలగిపోయింది. మొదటి నుంచి వినిపించిన పేర్లలోని వాళ్లే ఎక్కువగా ఈ షోకు సెలెక్ట్ కాగా ఏమాత్రం అంచనాలకు అందని విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు వాళ్ల మైనస్ లే ప్లస్ లు కాబోతున్నాయా…? అనే సందేహం కలుగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

లేటెస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో సీజన్ 4 మొదటి షో గొడవలు, ఏడుపులు, కొట్లాటలు, నామినేషన్ ప్రకియలతో గందరగోళంగా నడిచింది. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. షో ఆరంభంలోనే కనెక్షన్ గేమ్ పెట్టి 14 మందిని 7 జట్లుగా విడగొట్టాడు బిగ్ బాస్. మిగిలిన ఇద్దరినీ సోహెల్, అరియానాలు ఓ సీక్రెట్ రూంలో పెట్టేశాడు. నామినేషన్ పరంగా మొదటి వారంలో వీరిద్దరు అయితే తప్పించుకున్నారు. అలాగే ఏడుగురు కంటెస్టెంట్లు మొదటి వారంలో నామినేట్ అయ్యారు. కనెక్షన్ గేమ్ అని ముందే ఓ లింక్ పెట్టిన బిగ్‌బాస్.. ఆ లింక్‌ను నామినేషన్ ప్రక్రియలో విప్పేశాడు.

7 జంటల్లోంచి గంగవ్వ, సుజాత, సూర్య కిరణ్, అభిజీత్, అఖిల్ సర్తాక్, దివి, మెహబూబ్ నామినేట్ అయ్యారు. అయితే గంగవ్వను నామినేట్ చేసే ప్రాసెస్‌లో అందరూ ఓ కారణాన్నితెలియజేసారు. గంగవ్వకు ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఎలాగైనా సేవ్ అవుతుందని చెబుతూ అందరూ ఆమెను నామినేట్ చేశారు. మొదటి వారంలోనే నామినేషన్‌లో పడ్డ గంగవ్వను సేవ్ చేసేందుకు అందరూ తమ తమ ఓటు ఆయుదాన్ని ఉపయోగించారు. ఓట్ల సునామిలో గంగవ్వకు దరిదాపుల్లోకి ఎవ్వరూ కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే గంగవ్వను కూడా బిగ్‌బాస్ బాగానే వాడాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

గంగవ్వ.. ఈ పేరు తెలియని వారుండరు. చాలా తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సహజ నటి. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తుంది. చదువు లేదు. నటనలో శిక్షణ లేదు. కానీ యాక్టింగ్‌ ఇరగదీస్తుంది. తక్కువ టైంలోనే స్టార్‌ నటీగా ఎదిగింది గంగవ్వ. అందుకే గంగవ్వ మాట్లాడే మాటలు, ఆమె సెటైర్లను చూపిస్తూ ఫోకస్ అయ్యేలా చేస్తున్నాడు. గంగవ్వ వల్లే ఆటకు అందం వస్తుందని బిగ్ బాస్ ఈ స్ట్రాటజీని ప్లే చేసి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగవ్వకు వస్తోన్నఓటింగ్ శాతం చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరగాల్సిందే. వస్తున్న ఓట్లన్నంటిలోయాభై శాతానికి పైగా వాట గంగవ్వదే అవ్వడం లేటెస్ట్ ట్విస్ట్. ఏది ఏమైనా గంగవ్వ మాత్రం సూపర్ అంటూ సలాం కొడుతున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ షోలో చివరిగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ గంగవ్వ. 57 ఏళ్ల గంగవ్వకు బిగ్ బాస్ షో గురించి కనీస అవగాహన లేదు. ఈ గేమ్ షోలో ఎలా ఆడాలో కూడా ఆమెకు తెలీదు. అయితే ఆమె అమాయకత్వమే ఆమెకు అభిమానులను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో గంగవ్వ పేరిట ఆర్మీలు మొదలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here