బిగ్ బాస్ సీజన్ 5 లో నాలుగో వారం రన్ అవుతోంది. అందులో ఇప్పటికే కెప్టెన్సీ టాస్క్ కూడా పూర్తి చేసుకున్నారు. అందులో చివరగా ముగ్గురు కంటెస్టెంట్లు పోటీలో ఉండగా.. వాళ్ల కు హౌస్ లోనే మద్దతు తెలిపే విధానం ద్వారా ఎన్నిక చేశారు. కానీ ఇందులో సన్నీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

ప్రతీ ఒక్కరూ సన్నీని టార్గెట్ చేసి.. అతడు కెప్టెన్సీకి అర్హులు కాదంటూ చెప్పారు. దీంతో సన్నీతోపాటు శ్వేతా వర్మ కూడా ఓడిపోయారు. చివరకు శ్రీరామ్ నాలుగో వారం కెప్టెన్ గా నిలబడ్డాడు. అతడి సారథ్యంలోనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టేశాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులు బెస్ట్, వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది తమ అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఇందులో ఎక్కువగా మానస్ బెస్ట్ అని.. వరస్ట్ పర్ఫామర్గా జెస్సీని ఎంచుకున్నారు.
అనంతరం జెస్సీని జైలుకు పంపించారు. తర్వాత హౌస్ లో ఓ స్పెషల్ ప్రోగ్రాం జరిగింది. అందులో సన్నీ వీజేగా..శ్రీరామ చంద్ర గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సన్నీ తన స్టైల్లో ఇంటర్వ్యూ చేసి మెప్పించాడు. సిరి, హమిదాలలో ఎవరిని ఎంచుకుంటావ్ అని కాజల్.. శ్రీరామ్ ను అడుగుతుంది.దానికి అతడు లంచ్ సిరితో అని.. డిన్నర్ హమిదాతో అంటూ ఆన్సర్ ఇచ్చాడు.
ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో ఎవరిని కోరుకుంటున్నావ్ అని అడగ్గా.. సిరి కమిట్ కాకపోయి ఉంటే.. ఆమెను ట్రై చేసే వాడిని అంటూ సమాధానం చెబుతాడు శ్రీరామ్. తర్వాత సన్నీ హౌస్ లో ఉన్న వాళ్లను ఇమిటేట్ చేస్తూ.. నవ్వులు పూయిస్తాడు. సందడి సందడిగా అక్కడ ప్రోగ్రాం సాగిపోతుంది.






























