Bigg Boss 7: ఆగస్టులోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 7…. పూర్తి అయిన ఏర్పాట్లు?

0
61

Bigg Boss 7: బుల్లితెరపై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటివరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది..

ఇలా ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ లేకుండా ఒకేసారి మేకర్స్ ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో విడుదల చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.అయితే ఈ సీజన్ ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కాస్త తొందరగానే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ 7 కార్యక్రమం ఈసారి సెప్టెంబర్లో కాకుండా ఆగస్టు రెండవ వారంలోని ప్రసారం కాబోతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నింటిని కూడా పూర్తి చేశారని తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని ఇక హౌస్ లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సమాచారం.

Bigg Boss 7: ఆగస్టు రెండవ వారంలోనే ప్రసారం..


ఈ విధంగా ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇదివరకు సీజన్ల మాదిరి కాకుండా ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారట. అలాగే కంటెంట్లకు కూడా విభిన్నమైన టాస్కులను ప్లాన్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కొనసాగే కంటెస్టెంట్లకు కూడా ఈసారి మేకర్స్ కాస్త కఠినమైన కండిషన్లు కూడా పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమ ప్రసారానికి సంబంధించిన అప్డేట్ కూడా వెలబడునుంది.